Home> జాతీయం
Advertisement

త్వరలో పట్టాలెక్కనున్న తొలి సెమీ హైస్పీడ్ రైలు..!

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 160 కి.మీ వేగంతో దూసుకెళ్లే తొలి సెమీ హైస్పీడ్ రైలు మనదేశంలో తయారవుతోంది. 

త్వరలో పట్టాలెక్కనున్న తొలి సెమీ హైస్పీడ్ రైలు..!

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 160 కి.మీ వేగంతో దూసుకెళ్లే తొలి సెమీ హైస్పీడ్ రైలు మనదేశంలో తయారవుతోంది. ఈ రైలు వల్ల కలిగే ప్రధానమైన ఉపయోగాల్లో మొదటిది.. రెండు నగరాల మధ్య ఉన్న ప్రయాణ సమయాన్ని బాగా తగ్గించడం. రెండవది.. అధునాతన సాంకేతికతతో నడపడం. 16 కోచ్‌లు గల ఈ రైలును ప్రీమియం శతాబ్ది ఎక్స్ ప్రెస్ రూపంలో తీసుకురానున్నారు. దాదాపు రూ.100 కోట్ల ఖర్చుతో దీనిని తయారుచేయడం గమనార్హం. ఒక్కో కోచ్ నిర్మాణానికే దాదాపు రూ.6 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ దీనికి తయారీదారుగా వ్యవహరించింది. దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఇండియన్ రైళ్లలో అత్యంత వేగంతో వెళ్లే సెమీ హై స్పీడ్ ‌రైలు ఇదని.. ఇప్పటికే రైల్వే అధికారులు ప్రకటించారు. మేకిన్ ఇండియాలో భాగంగా దీనిని రూపొందించినట్లు ఐసీఎఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సుధాన్ష్‌ మణి ఓ ప్రకటనలో తెలిపారు

Read More