Home> జాతీయం
Advertisement

CAA: ఇంకెన్నాళ్లిలా ? పౌరసత్వం ఇవ్వండి దయచేసి

మూడు దశాబ్దాలుగా భారత్ లోనే  నివసిస్తున్నారు. అయినా నిత్యం వీసా రెన్యువల్ చేయించుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు తమకు కూడా భారత దేశ పౌరసత్వం ఇవ్వాలని కోరుతున్నారు ఆ విదేశీ సంతతి ఇండియన్లు.

CAA: ఇంకెన్నాళ్లిలా ? పౌరసత్వం ఇవ్వండి దయచేసి

మూడు దశాబ్దాలుగా భారత్ లోనే  నివసిస్తున్నారు. అయినా నిత్యం వీసా రెన్యువల్ చేయించుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు తమకు కూడా భారత దేశ పౌరసత్వం ( Indian Citizenship ) ఇవ్వాలని కోరుతున్నారు ఆ విదేశీ సంతతి ఇండియన్లు.

దేశ విభమూడు జనకు ముందు అంతా భారతీయులే. కొందరు పాకిస్తాన్ లో..మరికొందరు ఆఫ్ఘనిస్తాన్ లో. ఇంకొందరు బంగ్లాదేశ్ లో. ఇలా మతం వేరైనా అక్కడక్కడా స్థిరపడిపోయారు. దేశ విభజన అందర్నీ చీల్చేసింది. ఎక్కడివారినక్కడే నిలువరించేసింది. అదృష్టం ఉన్నవారు అనుకున్నచోటికి వెళ్లగలిగారు. మిగిలినవారు వెళ్లలేక ఉండిపోయిన పరిస్థితి. అదే కోవలో ఆఫ్ఘనిస్తాన్ లో ఉండిపోయాయి కొన్నిసిక్కు కుటుంబాలు. Also read: Maharashtra: ప్రధాని మోదీని ఉద్దవ్ ఏం కోరారు ?

పరిస్థితులు అనువుగా లేని కారణంగా ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan ) నుంచి 1992లో ఇండియాకు వలస వచ్చేశారు. అప్పట్నించి వీసా రెన్యువల్ చేయించుకుంటూ ఇండియాలో బతుకు వెళ్లదీస్తున్నాయి ఆ కుటుంబాలు. ఇప్పుడు కోవిడ్ 19 ( Covid 19 ) కారణంగా వీసాల రెన్యువల్ ( Visa renual ) ఇప్పుడు కష్టతరంగా మారింది. అందుకే భారత దేశ పౌరసత్వం ఇవ్వమని ప్రధాని నరేంద్ర మోదీను కోరుతున్నాయి ఆ సిక్కు కుటుంబాలు.

సీఏఏ చట్టం ( CAA ) ఇప్పుడు అమల్లో ఉన్నందున భారతదేశ పౌరసత్వం ఇవ్వడానికి అభ్యంతరం ఉండకపోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. Also read: Face Mask: 22 మైళ్ల దూరం ఎందుకు పరుగెట్టాల్సి వచ్చింది ?

Read More