Home> జాతీయం
Advertisement

కరోనా భయం ‘హత్య’ కలకలం!

అవసరమైతే ముఖానికి మాస్క్ తప్పనిసరిగా వాడాలని ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. (Father Kills Son)

కరోనా భయం ‘హత్య’ కలకలం!

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని అవసరమైతే ముఖానికి మాస్క్ తప్పనిసరిగా వాడాలని ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది.  తాను ఎంత చెప్పి చూసినా మాస్క్ ధరించడం లేదన్న కోపంతో కుమారుడినే కడతేర్చాడు ఓ పెద్దాయన. పశ్చిమ బెంగాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి ఆగిందని వధువు ఆత్మహత్య

పోలీసుల కథనం ప్రకారం.. కోల్‌కతాలోని శ్యామ్‌పుకర్ పోలీస్టేషన్ పరిధిలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. షిర్సెండు మల్లిక్ (45)ని బయటకు వెళ్తే తప్పనిసరిగా ముఖానికి మాస్క్ ధరించాలని తండ్రి బన్సింధర్ మల్లిక్ (78) సూచించారు. షిర్సెండుకు శారీరక వైకల్యం ఉన్నట్లు తెలుస్తోంది. మాస్క్ ధరించడానికి షిర్సెండ్ నిరాకరించాడు. క్షణికావేశానికి లోనైన బన్సిందర్ తన కుమారుడు షిర్సెండ్‌ గొంతుకు గుడ్డ బిగించి ఊపిరాడకుండా చేశాడు. ఈ క్రమంలో షిర్సెండు చనిపోయాడు.  PHotos: హెబ్బా.. అందాలు చూస్తే అబ్బా!

అనంతరం బన్సింధర్ శ్యామ్‌పుకర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. జరిగిన విషయాన్ని పోలీసులుకు వివరించాడు. కరోనా సోకుతుందని ఎంత చెప్పినా వినకపోవడంతో ఇలా చేయాల్సి వచ్చిందన్నాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు షిర్సెండును ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు సీనియర్ అధికారి తెలిపారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

 ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos

Read More