Home> జాతీయం
Advertisement

FASTag: ఫిబ్రవరి 15 ఫాస్టాగ్ చివరి తేదీ..ఇక పొడిగింపు లేదు

FASTag: అన్ని గడువు తేదీలు ముగిసిపోయాయి. ఇక జాతీయ రహదార్లపై ప్రయాణించాలంటే ఫాస్టాగ్ తప్పనిసరి. లేదంటే నో ఎంట్రీ ఇన్ హైవేస్. ఫాస్టాగ్ ఎలా తీసుకోవాలి, ఎలా రీఛార్జ్ చేసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలనే వివరాలు మీ కోసం..

FASTag: ఫిబ్రవరి 15 ఫాస్టాగ్ చివరి తేదీ..ఇక పొడిగింపు లేదు

FASTag: అన్ని గడువు తేదీలు ముగిసిపోయాయి. ఇక జాతీయ రహదార్లపై ప్రయాణించాలంటే ఫాస్టాగ్ తప్పనిసరి. లేదంటే నో ఎంట్రీ ఇన్ హైవేస్. ఫాస్టాగ్ ఎలా తీసుకోవాలి, ఎలా రీఛార్జ్ చేసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలనే వివరాలు మీ కోసం..

కేంద్ర రహదారి, రవాణా మంత్రిత్వ శాఖ కొత్తగా తీసుకొచ్చిన ఫాస్టాగ్  ( FASTag ) విధానం ఫిబ్రవరి 15 నుంచి విధిగా అమలు కానుంది. రెండుసార్లు గడువు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం ( Central government )..ఫిబ్రవరి 15 వరకూ చివరి అవకాశమిచ్చింది. జాతీయ రహదార్లపై ప్రయాణించాలంటే ఫోర్ వీలర్స్‌కు ఫాస్టాగ్ ఇక విధిగా ఉండాల్సిందే. ఫాస్టాగ్ లేకుండా టోల్‌ఫీజు చెల్లించాలంటే రెండింతలవుతుంది. మరో పన్నెండు రోజుల్లో చివరి గడువు తేదీ కాస్తా సమీపించనుంది. 

అసలు ఫాస్టాగ్ అంటే ఏమిటి..ఎలా పని చేస్తుంది

How FASTag will work

ఫాస్టాగ్ అనేది టోల్‌గేట్ ఎంట్రీ కార్డ్ లాంటిది. ఇందులో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా టోల్‌ఫీజు ఆటోమేటిక్‌గా చెల్లించవచ్చు. ఈ ఫాస్టాగ్ అనేది మీ సేవింగ్ ఎక్కౌంట్ లేదా డిజిటల్ వాలెట్‌తో అనుసంధానించబడుతుంది. దీనిని మీ ఫోర్ వీలర్ వాహనం విండ్‌స్క్రీన్‌పై అమర్చాలి. ఇది ఒక బార్ కోడ్ స్టిక్కర్. దీని ద్వారా టోల్ చెల్లించడానికి మీరు వాహనం ఆపవలసిన అవసరం లేదు. టోల్‌ను దాటేటప్పుడు అక్కడున్న కెమేరాలు బార్‌కోడ్‌ను స్కాన్ చేసి..సంబంధిత రుసుమును అనుసంధానిత ఎక్కౌంట్ నుంచి చెల్లించుకుంటుంది.  దీనివల్ల సమయం, ఇంధనం ఆదా చేయడం, ట్రాఫిక్‌ను తగ్గించడం వీలవుతుంది. 

ఫాస్టాగ్ ఎక్కడ తీసుకోవచ్చు 

Where you will get FASTAg

ఫాస్టాగ్‌లను ఏదైనా బ్యాంకు లేదా ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఐసిఐసిఐ, ఎస్‌బిఐ, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులు ఫాస్టాగ్ సేవలు అందిస్తున్నాయి. అంతేకాకుండా టోల్‌ప్లాజా ( Toll plaza ), ఈ-కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. అలాగే మై ఫాస్టాగ్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీటితో పాటు ప్రముఖ డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్‌లు గూగుల్ పే, అమెజాన్ పే, పేటీఎం వంటి యాప్‌లు కూడా ఫాస్టాగ్‌ను అందిస్తున్నాయి.

ఫాస్టాగ్  తీసుకోవాలంటే ఏం కావాలి

What you need to get FASTag

వాహనపు ఆర్‌సి తప్పనిసరి. ఇది లేకుండా ఫాస్టాగ్ తీసుకోలేము. ఆర్‌సి అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. ఫాస్టాగ్ తిసుకోవాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ నంబర్ కలిగి ఉండాలి.

ఫాస్టాగ్ బదిలీ చేసుకోవచ్చా

Can FASTag transferred

మీ వాహనం ఫాస్టాగ్ మరెవరికీ బదిలీ చేయకూడదు. చేయలేరు కూడా. మీరు వాహనాన్ని విక్రయిస్తుంటే మీ వాహనం ఫాస్టాగ్ ఖాతాను నిలిపివేయాల్సి ఉంటుంది.

ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవడమెలా

How to recharge FASTag

ఫాస్టాగ్ డిజిటల్ వాలెట్‌ను క్రెడిట్, డెబిట్ కార్డులు లేదా యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి సదుపాయాలతో రీచార్జ్ చేసుకోవచ్చు. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్పే వంటి డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా కూడా ఫాస్టాగ్ వాలెట్‌ను రీచార్జి చేసుకోవచ్చు.

ఫాస్టాగ్ నుంచి మినహాయింపు ఎవరెవరికి

Who are exempted from FASTag

న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, ఎమర్జెన్సీ సర్వీస్ వర్కర్స్ ఫాస్టాగ్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. వీరికి ఫాస్టాగ్ చెల్లింపుల నుంచి మినహాయింపు లభిస్తుంది.

Also read: Airtel Hacked: ఎయిర్ టెల్ కస్టమర్ల డేటా హ్యాక్..అమ్మకానికి సిద్ధం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More