Home> జాతీయం
Advertisement

Fake Hospital Busted: ఫేక్ హాస్పిటల్.. ఇక్కడ డాక్టర్ కూడా ఫేకే

Fake Hospital Busted In Gurugram: ఈ ఫేక్ హాస్పిటల్ పేరు మెడీవర్సల్ హాస్పిటల్. హర్యానాలోని నుహ్ జిల్లాకు చెందిన వ్యక్తి ఈ హాస్పిటల్ ని నిర్వహిస్తున్నాడు. అతడు చదివింది కేవలం 10వ తరగతి వరకే. కానీ తనను తానే ఈ హాస్పిటల్ కి డాక్టర్ గా ప్రకటించుకున్నాడు. 

Fake Hospital Busted: ఫేక్ హాస్పిటల్.. ఇక్కడ డాక్టర్ కూడా ఫేకే

Fake Hospital Busted In Gurugram: ఫేక్ చాక్లెట్స్, ఫేక్ మిల్క్, ఫేక్‌ పాస్‌పోర్ట్.. లేదంటే ఫేక్ డాక్టర్, ఫేక్ పోలీసు ఆఫీసర్, ఫేక్ ఐఏఎస్, ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్.. ఇలా ఎన్నో చూసి ఉంటారు. కానీ ఫేక్ హాస్పిటల్‌ని ఎప్పుడైనా చూశారా ? ఎప్పుడూ చూడలేదు కదా.. కానీ నిజంగానే కొంతమంది కేటుగాళ్లు ఫేక్ హాస్పిటల్స్‌ని కూడా నిర్వహిస్తున్నారని గురుగ్రామ్‌లో ఫేక్ హాస్పిటల్ బాగోతం బయటపడిన తరువాతే అర్థమైంది. అవును, ఢీల్లీని ఆనుకుని ఉన్న గురుగ్రామ్ పరిధిలోని వజీరాబాద్ లో 16 బెడ్స్ తో ఓ హాస్పిటల్ ఉంది. ఇందులో డయాగ్నస్టిక్స్ ల్యాబ్స్, ఆపరేషన్ థియేటర్, ఐసియూ.. ఇలా అన్ని ఆస్పత్రుల్లో ఉండే సౌకర్యాలన్నీ అందుబాటులో ఉన్నాయి. వజీరాబాద్ లోని 52 సెక్టార్ లో ఈ హాస్పిటల్ రన్ అవుతోంది.

ఈ ఫేక్ హాస్పిటల్ పేరు మెడీవర్సల్ హాస్పిటల్. హర్యానాలోని నుహ్ జిల్లాకు చెందిన వ్యక్తి ఈ హాస్పిటల్ ని నిర్వహిస్తున్నాడు. అతడు చదివింది కేవలం 10వ తరగతి వరకే. కానీ తనను తానే ఈ హాస్పిటల్ కి డాక్టర్ గా ప్రకటించుకున్నాడు. అయితే హాస్పిటల్ నిర్వహణ తీరుపై అనుమానం రావడంతో పాటు పలు ఫిర్యాదులు కూడా అందడంతో అధికారులు ఈ ఆస్పత్రిపై కన్నేశారు. 

ఇది కూడా చదవండి : Kolkata Metro Rail: దేశంలోనే తొలిసారిగా నది కింద నుంచి మెట్రో రేక్ రన్.. చరిత్ర సృష్టించిన కోల్‌కతా మెట్రో రైలు

పోలీసుల సహాయంతో హర్యానా సీఎం ఫ్లయింగ్ స్వ్కాడ్, ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన సోదాల్లో ఈ ఆస్పత్రి బండారం బయటపడింది. ఆస్పత్రిలో ఉన్న సౌకర్యాలు చూసి పోలీసులే ఖంగుతిన్నారు. 16 బెడ్స్, జనరల్ వార్డ్, ప్రైవేటు రూమ్స్, జనరల్ వార్డ్, ప్రైవేట్ రూమ్స్, ల్యాబ్ టెస్టింగ్ పరికరాలు, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ రూమ్, ఆపరేషన్ థియేటర్ ఇలా అన్ని సౌకర్యాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి : Old Pension Scheme: ఓపీఎస్‌పై లేటెస్ట్ అప్‌డేట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యగమనిక

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Read More