Home> జాతీయం
Advertisement

Covaxin: పిల్లలకు త్వరలో కొవాగ్జిన్‌ టీకా...అనుమతించిన నిపుణుల కమిటీ!

Covaxin:  భారత్‌ బయోటెక్‌ కంపెనీ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక అనుమతులు ఇచ్చింది. 2-18 ఏళ్ల వారికి కోవాగ్జిన్ టీకా వేసేందుకు పచ్చజెండా ఊపింది. వ్యాక్సిన్లపై ఏర్పాటైన నిపుణుల కమిటీ ఈమేరకు అనుమతులిచ్చింది.
 

Covaxin:  పిల్లలకు త్వరలో కొవాగ్జిన్‌ టీకా...అనుమతించిన నిపుణుల కమిటీ!

Covaxin:  కరోనా నుంచి పిల్లలకు రక్షణ కల్పించేలా కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 2-18 ఏళ్ల వారికి కొవాగ్జిన్‌(Covaxin) టీకా ఇచ్చేందుకు నిపుణుల కమిటీ(expert panel) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కొవాగ్జిన్‌కు అత్యవసర అనుమతులు జారీ చేయాలని కేంద్రానికి సిఫార్సులు చేసింది. 

ప్రముఖ దేశీయ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్‌(Bharat Biotech) చిన్నారుల కోసం రూపొందించిన కొవాగ్జిన్ టీకాపై ఇటీవల ఆ సంస్థ క్లినికల్‌ ప్రయోగాలు నిర్వహించిన విషయం తెలిసిందే. 2 నుంచి 18ఏళ్ల వారి కోసం కొవాగ్జిన్‌ టీకా 2, 3 దశల ప్రయోగాలను గత నెలలో పూర్తి చేసిన భారత్‌ బయోటెక్‌.. ఆ నివేదికను భారత ఔషధ నియంత్రణ సంస్థకు(డీసీజీఐ) అందజేసింది. వ్యాక్సిన్‌ను దాదాపు 525 మంది చిన్నారులపై ప్రయోగించారు. ఈ నివేదికను పరిశీలించిన డీసీజీఐ నిపుణుల కమిటీ.. పిల్లలకు కొవాగ్జిన్‌ టీకా(Vaccine for Children) ఇచ్చేలా అత్యవసర అనుమతులు జారీ చేయాలని సిఫార్సులు చేసింది. దీనికి కేంద్రం ఆమోదముద్ర వేయాల్సి ఉంది.

Also read:NIA Raids: కశ్మీర్ హత్యలు, హెరాయిన్ పట్టివేత కేసుల విషయంలో ఎన్‌ఐఏ దాడులు

కేంద్రం అనుమతి లభిస్తే భారత్‌(India)లో పిల్లలకు అందుబాటులో వచ్చే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్‌ ఇదే కానుంది. పిల్లలకు ఇచ్చే కొవాగ్జిన్‌ టీకా కూడా రెండు డోసుల టీకానే. తొలి డోసు ఇచ్చిన 20 రోజులకు రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా.. గుజరాత్‌కు చెందిన జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డి టీకాకు కేంద్రం అత్యవసర అనుమతులు మంజూరుచేసిన విషయం తెలిసిందే. ఈ టీకాను 12ఏళ్ల పైబడిన వారందరికీ ఇచ్చేలా అభివృద్ధి చేశారు. అయితే జైకోవ్‌-డి వ్యాక్సిన్‌ పంపిణీని సంస్థ ఇంకా ప్రారంభించలేదు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Read More