Home> జాతీయం
Advertisement

Dream11: డ్రీమ్ 11 యాప్‌లో 1.5 కోట్ల గెల్చిన ఎస్సై, బెట్టింగ్ చేసినందుకు సస్పెన్షన్ వేటు

Dream11: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ అతడిని కోటీశ్వరుడిని చేసింది. మూడు నెలలుగా ప్రయత్నిస్తున్న అతడికి అదృష్టం వరించింది. అదే అతనికి శాపమైంది. ఉద్యోగంపై వేటు పడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Dream11: డ్రీమ్ 11 యాప్‌లో 1.5 కోట్ల గెల్చిన ఎస్సై, బెట్టింగ్ చేసినందుకు సస్పెన్షన్ వేటు

Dream11: క్రికెట్ ప్రేమికులకు డ్రీమ్ 11 యాప్ సుపరిచితమే. ఇది అధికారికంగా ఆన్‌లైన్ ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫామ్ అయినా అనధికారికంగా బెట్టింగ్ యాప్. టీమ్ ఇండియా ప్లేయర్లే అధికారికంగా ప్రకటనలిస్తున్నందున ఆడవచ్చా లేదా ప్రశ్నలు వస్తున్నాయిప్పుడు.

ఇప్పటివరకూ లేని సందేహం ఇప్పుడే ఎందుకంటే మహారాష్ట్ర పూణేలో జరిగిన ఈ ఘటన. పూణేకు చెందిన సోమనాథ్ జెండే చించ్‌వాడ్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు. అక్టోబర్ 10న విధుల్లో ఉన్న ఇతడు ఇంగ్లండ్-బంగ్లాదేశ్ మ్యాచ్‌పై బెట్టింగ్ వేశాడు. ఈ మ్యాచ్‌కు బెస్ట్ ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేశాడు. ఫాంటసీ గేమ్‌లో టాప్‌లో నిలిచి ఏకంగా 1.5 కోట్లు గెల్చుకున్నాడు. ఒక్క దెబ్బతో కోటీశ్వరుడైపోయాడు. అతని ఆనందానికి అంతులేదు. ఈ డబ్బులో కొంతభాగంతో ఇంటి రుణాల్ని క్లియర్ చేసి మిగిలిన భాగాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనేది అతని ఆలోచన. డ్రీమ్ 11లో 1.5 కోట్లు వచ్చిన వార్తలు క్రమంగా వైరల్ అవుడంతో మహారాష్ట్ర పోలీస్ శాఖ అతనిపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. అతడిపై సస్పెన్షన్ వేటు వేసింది.

నిబంధనలకు వ్యతిరేకంగా పోలీస్ శాఖ ప్రతిష్ఠకు భంగం కల్గించారనే ఆరోపణతో సస్పెండ్ చేశారు. అంతేకాకుండా దీనిపై విచారణ చేపట్టనున్నారు. ఈ ఘటన ఇప్పుడు అందరిలో ప్రశ్నలు రేపుతోంది. బెట్టింగ్ యాప్ ఆడటం నేరమైనప్పుడు అధికారికంగా ఎలా ప్రకటనలు ఇస్తారంటూ మండిపడుతున్నారు. ఏకంగా టీమ్ ఇండియా ఆటగాళ్లు, ఇతర దేశస్థులు ఈ యాప్‌కు ప్రకటనకర్తలుగా ఉన్నారు. డ్రీమ్ 11 అనేది క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, కబడ్డి, హ్యాండ్‌బాల్, బాస్కెట్ బాల్, వాలీబాల్, రగ్బీ, బేస్‌బాల్‌లో బెట్టింగ్‌కు అనుమతిస్తుంది. 

Also read: IND vs BAN World Cup 2023: బంగ్లాదేశ్‌దే బ్యాటింగ్.. టాస్‌కు ముందు బిగ్‌షాక్.. మ్యాచ్‌కు కెప్టెన్ దూరం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More