Home> జాతీయం
Advertisement

Donald Trump's Ahmedabad tour schedule : డొనాల్డ్ ట్రంప్ పర్యటనలో మార్పులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మెదాబాద్ పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం అహ్మెదాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ కలిసి 22 కి.మీ మేర రోడ్ షో చేపట్టాల్సి ఉండగా.. తాజాగా ఆ రోడ్ షోను 9 కిమీ కుదించారు.

Donald Trump's Ahmedabad tour schedule : డొనాల్డ్ ట్రంప్ పర్యటనలో మార్పులు

అహ్మెదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మెదాబాద్ పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం అహ్మెదాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ కలిసి 22 కి.మీ మేర రోడ్ షో చేపట్టాల్సి ఉండగా.. తాజాగా ఆ రోడ్ షోను 9 కిమీ కుదించారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం  గాంధీ ఆశ్రమాన్ని కూడా సందర్శించాల్సి ఉండగా.. తాజా షెడ్యూల్‌లో గాంధీ ఆశ్రమం పర్యటనను రద్దుచేశారు. దీంతో 22 కిమీ రోడ్ షో కాస్తా.. 9 కిమీకు తగ్గినట్టయింది. అహ్మెదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రారంభం కానున్న ఈ రోడ్ షో.. గాంధీ నగర్‌లోని కోటేశ్వర్ మీదుగా మొతెరా వరకు కొనసాగనుంది. 

9 కిమీ రోడ్ షోలో భాగంగా గాంధీ నగర్‌లో 4కిమీ మేర ప్రయాణించనున్నారు. ఈ 4 కిమీ రోడ్ షో కోసం ఏడుగు ఎస్పీ స్థాయి అధికారులు, 2000 మంది పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొనాల్సిందిగా గాంధీనగర్ ఐజి ఆదేశాలు జారీచేశారు. ఈ పర్యటనలోనే ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన మొతెరా స్టేడియంను డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించనున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Read More