Home> జాతీయం
Advertisement

'బాహుబలి'గా డోనాల్డ్ ట్రంప్..

భారతీయ చలన చిత్ర స్టామినాను.. అందులోనూ తెలుగు చిత్ర పరిశ్రమ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం 'బాహుబలి'. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన  దర్శక ధీరుడు రాజమౌళి కళాఖండం ఈ సినిమా. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన  ఓ పేరడీ క్లిప్  .. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ కు రానున్న నేపథ్యంలో వైరల్ గా మారింది.

'బాహుబలి'గా డోనాల్డ్ ట్రంప్..

భారతీయ చలన చిత్ర స్టామినాను.. అందులోనూ తెలుగు చిత్ర పరిశ్రమ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం 'బాహుబలి'. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన  దర్శక ధీరుడు రాజమౌళి కళాఖండం ఈ సినిమా. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన  ఓ పేరడీ క్లిప్  .. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ కు రానున్న నేపథ్యంలో వైరల్ గా మారింది. అందులోనూ ఓ అభిమాని ట్వీట్ చేసిన వీడియోను అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ రీట్వీట్ చేయడం విశేషం.  

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రేపు (సోమవారం)  భారత్ కు రానున్నారు. భారత గడ్డ మీదకు రాబోయే కొద్ది గంటల ముందే ఆయన ఆ వీడియోను రీట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది. మొత్తం 20 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో హీరో ప్రభాస్‌ ముఖానికి ట్రంప్‌ ముఖాన్ని అతికించారు. హిందీలో బాహుబలి పాట వినిపిస్తోంది.  ట్రంప్ భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా ట్రంప్, కుమారుడు జూనియర్ ట్రంప్‌ కూడా వీడియోలో ఉండడం విశేషం. అంతే కాదు కూతురు, కుమారుడు ఇవాంకా ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌ను డోనాల్డ్ ట్రంప్‌ తన భుజాల మీద ఎత్తుకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. వీడియో పూర్తయ్యే ముందు ..  'యుఎస్ఏ అండ్ ఇండియా యునైటెడ్' అని కనిపించడం ఆసక్తి రేపుతోంది. ఈ వీడియోను రీట్వీట్ చేసిన ట్రంప్‌..   'భారత్‌లో  నాకు గొప్ప స్నేహితులు ఉన్నారంటూ' రీట్వీట్ చేశారు.

రేపు, ఎల్లుండి భారత్ లో పర్యటించనున్న డోనాల్డ్  ట్రంప్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయన గుజరాత్ లో అంతర్జాతీయంగా అతి పెద్ద స్టేడియంగా నిర్మితమైన మొతెరా స్టేడియంను ప్రారంభిస్తారు. ఇందుకోసం 22 కిలోమీటర్ల పాటు ర్యాలీగా వెళ్తారు.

Read Also: పెద్దన్న రాక కోసం..!!

Read More