Home> జాతీయం
Advertisement

విషాదం.. కరోనాతో పుట్టినరోజు నాడే ఎమ్మెల్యే మృతి

కరోనా మహమ్మారి సోకి ఓ శాసనసభ్యుడు కన్నుమూశారు. దీంతో ఆ పార్టీతో పాటు రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. కరోనాతో చనిపోయిన తొలి ఎమ్మెల్యే ఘటన ఇది.

విషాదం.. కరోనాతో పుట్టినరోజు నాడే ఎమ్మెల్యే మృతి

కరోనా వైరస్ తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్న రాష్ట్రాలలో ఒకటైన తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. ప్రాణాంతక కరోనా మహమ్మారి బారిన పడిన డీఎంకే (DMK) ఎమ్మెల్యే అన్బళగన్ (Anbazhagan) చనిపోయారు. చెన్నెలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అన్బళగన్  (MLA Anbazhagan Died)తుదిశ్వాస విడిచారు. అయితే కోవిడ్19 కారణంగా దేశంలో ఓ శాసనసభ్యుడు (MLA) చనిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కోటి రూపాయల ప్రైజ్‌మనీ విజేత ఆ డ్యాన్సర్

గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్ మీద ఉంచి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం వేకువజామున పరిస్థితి విషమించడంతో డాక్టర్ రేలా ఇన్‌స్టిట్యూట్ అండ్ మెడికల్ సెంటర్‌లో చికిత్స పొందుతూనే ఎమ్మెల్యే అన్బళగన్ కన్నుమూశారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్

Read More