Home> జాతీయం
Advertisement

రైలు ప్రయాణికులని తిప్పలు పెడుతున్న పొగ మంచు

దట్టమైన పొగ మంచు కారణంగా ఉత్తర భారత్ నుంచి రాకపోకలు సాగించే రైళ్లన్నీ సుమారు 4 గంటల నుంచి 22 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 

రైలు ప్రయాణికులని తిప్పలు పెడుతున్న పొగ మంచు

ఉత్తర భారతంలో నిత్యం కురుస్తోన్న పొగ మంచు రైలు ప్రయాణాలకి తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. దట్టమైన పొగ మంచు కారణంగా సోమవారం నాడు ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే రైళ్లలో మొత్తం 30 రైళ్లు ఆలస్యంగా నడిచినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. అంతేకాకుండా మరో 10 రైళ్లని పూర్తిగా రద్దు చేసి, 6 రైళ్ల టైమింగ్స్‌ని రీషెడ్యూల్ చేసినట్టు అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పొగ మంచు కారణంగా ఉత్తర భారతంలో రైళ్లు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తుండటంతో ఉత్తర భారత్‌కి వెళ్లాల్సి వున్న దక్షిణాది ప్రయాణికులు, అలాగే ఉత్తరాది నుంచి దక్షిణాది వెళ్లాల్సి వున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. 

పొగ మంచు కారణంగా రైలు మార్గాన్ని దూరం నుంచే చూసే పరిస్థితి లేదు. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా లోకో పైలట్లు రైలు వేగాన్ని గంటకు 15 కి.మీ మించకుండా చూసుకుంటున్నారు. ఫలితంగా ఆయా మార్గాల ద్వారా రాకపోకలు సాగించే రైళ్లన్నీ సుమారు 4 గంటల నుంచి 22 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 

Read More