Home> జాతీయం
Advertisement

Kidnap on camera: కిడ్నాపర్లతో తల్లి వీరోచిత పోరాటం.. యువకుడి సాహసం.. వైరల్ వీడియో

ఇంటి ముందు నుంచే నాలుగేళ్ల చిన్నారిని అపహరించేందుకు ప్రయత్నించిన కిడ్నాపర్ల ( Kidnap attempt ) నుంచి ఓ తల్లి తన నాలుగేళ్ల చిన్నారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో ( Caught on camera ) రికార్డయింది. అంతేకాకుండా ఆమె నుంచి బతుకుజీవుడా అని పారిపోతున్న ఇద్దరు కిడ్నాపర్లను పట్టుకునేందుకు మరో యువకుడు అత్యంత సమయస్పూర్తితో వ్యవహరించాడు.

Kidnap on camera: కిడ్నాపర్లతో తల్లి వీరోచిత పోరాటం.. యువకుడి సాహసం.. వైరల్ వీడియో

ఢిల్లీ: ఇంటి ముందు నుంచే నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన కిడ్నాపర్ల ( Kidnap attempt ) నుంచి ఓ తల్లి తన నాలుగేళ్ల చిన్నారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో ( Caught on camera ) రికార్డయింది. అంతేకాకుండా ఆమె నుంచి బతుకుజీవుడా అని పారిపోతున్న ఇద్దరు కిడ్నాపర్లను పట్టుకునేందుకు మరో యువకుడు అత్యంత సమయస్పూర్తితో వ్యవహరించాడు. ఆ దృశ్యం సైతం అక్కడి సీసీటీవీల్లో రికార్డయింది. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా ( Viral videos ) మారాయి. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని షకార్‌పూర్‌లో నివాసం ఉంటున్న ఓ మహిళ ఇంట్లోకి చొరబడిన కిడ్నాపర్.. ఆమె కళ్లముందే చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. ఒక కిడ్నాపర్ చిన్నారిని ఎత్తుకెళ్లగా.. అదే సమయంలో మరో కిడ్నాపర్ బైక్ స్టార్ట్ చేసుకుని మొదటి కిడ్నాపర్‌తో సహా అక్కడి నుంచి ఉడాయించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ వెంటనే అప్రమత్తమైన ఆమె.. ఒక్కసారిగా గేటులోంచి బయటకు దూసుకొచ్చి కిడ్నాపర్ల నుంచి తన చిన్నారిని లాక్కుంది. ( Also read: Rana Daggubati: రానా దగ్గుబాటి పెళ్లికి తేదీ, వేదిక ఫిక్స్.. వివరాలు ఇవే )

#Viral

ఈస్ట్ ధిల్లీ శకర్పూర్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఒక మహిళ చేతుల్లో నుంచి నాలుగేళ్ళ చిన్నారిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన దుండగులు. తల్లి ఎదురుతిరగడంతో పారిపోయిన కిడ్నాపర్లు. #Delhi #cctvcamera @DelhiPolice for cracking the case 👏🏻👏🏻 pic.twitter.com/AV0hXBXFtq

— Zee Hindustan Telugu (@ZeeHTelugu) July 22, 2020

కిడ్నాపర్లతో పోరాడుతూనే ఆమె గట్టిగా కేకలు వేయడంతో.. కిడ్నాపర్లు ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించారు. అయితే, అదే సమయంలో అటుగా వచ్చిన ఓ యువకుడు చాలా సమయస్పూర్తితో కిడ్నాపర్ల బైక్‌కి మరో బైకుని అడ్డంగా పెట్టి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ పెనుగులాటలో ఇద్దరు కిడ్నాపర్లు బైకుని అక్కడే వదిలేసి పరారయ్యారు. బైక్ ఆధారంగా ఢిల్లీ పోలీసులు ( Delhi police ) ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.  ( Also read: Health tips: వేపాకుతో ఇన్ని లాభాలు, ప్రయోజనాలా ? )

Read More