Home> జాతీయం
Advertisement

yamuna River: డేంజర్ లో ఢిల్లీ.. 45 ఏళ్ల రికార్డును తుడిచిపెట్టేసిన యమునా నది..!

yamuna River: దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ఉగ్ర రూపం దాల్చింది. ఎన్నడూ లేని విధంగా యమునా నదికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించింది. 
 

yamuna River: డేంజర్ లో ఢిల్లీ.. 45 ఏళ్ల రికార్డును తుడిచిపెట్టేసిన యమునా నది..!

yamuna water level: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటితో యమునా నది (Yamuna River) మహోగ్రరూపం దాల్చింది. డేంజర్ స్థాయిని దాటి మరి ప్రవహిస్తోంది. దీంతో 45 ఏళ్ల నాటి రికార్డు తుడుచిపెట్టుకుపోయింది. నది చరిత్రలో మొదటిసారి నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరింది. బుధవారం రాత్రికి ఢిల్లీ పాత రైల్వే వంతెన వద్ద యమునానది నీటి మట్టం 208.05 మీటర్లకు చేరినట్లు కేంద్ర జల సంఘం పేర్కొంది. 

45 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయి వరద
1978 తర్వాత ఈ స్థాయిలో నీటిమట్టం పెరగడం ఇదే తొలిసారి. నదీ ప్రవహం అంతకంతకూ పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే దేశరాజధాని ఢిల్లీలోని అనేక కాలనీలు నీటమునిగాయి. వరదలు సంభవించే అవకాశమున్న ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా 144 సెక్షన్‌ను విధించారు. పాత యుమున వంతెనపై ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేశారు. ఢిల్లీ రోడ్డు రవాణా సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కూడా వరదనీరు ముంచెత్తింది. కేజ్రీవాల్ నివాసం, ఢిల్లీ అసెంబ్లీకి కేవలం 500 మీటర్ల దూరం వరకు వరద నీరు వచ్చేసింది.

అమిత్ షాకు కేజ్రీవాల్ లేఖ
హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నుండి దిగువకు నీటిని విడుదల చేయడం యమునా నీటి మట్టం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో బ్యారేజ్ నుంచి నీటి విడుదల నిలిపివేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. మరోవైపు యమునాలో నీటిమట్టం పెరగడానికి ఎగువ రాష్ట్రాల్లో వర్షాలతోపాటు నదిలో పూడిక పెరిగిపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలో ఈ వర్షాల వల్ల ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ భారీ వర్షాలకు ఉత్తరాదిలో ఇప్పటివరకు వందమందికిపైగా మృతి చెందారు. ఇందులో 80 మంది హిమచల్ వాసులే. చాలా మంది టూరిస్టులు వరదల్లో చిక్కుపోయి అవస్థలు పడుతున్నారు. 

Also Read: Heavy Rains: ఉత్తరాదిన ఊహకందని జల విలయం.. ఇబ్బందుల్లో జనం.. 37కి చేరిన మృతులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More