Home> జాతీయం
Advertisement

Delhi Corona Status: దేశ రాజధానిలో అత్యల్పంగా కరోనా కేసులు, పూర్తిగా తగ్గిన కరోనా ఉధృతి

Delhi Corona Status: దేశ రాజధానిని భయభ్రాంతులకు లోను చేసిన కరోనా మహమ్మారి ఇప్పుడు పూర్తిగా శాంతించింది. ఏడాది కనిష్టానికి కేసులు చేరుకోవడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంటోంది. అటు కోవిడ్ పాజిటివిటీ రేటు కూడా గణనీయంగా తగ్గింది.
 

Delhi Corona Status: దేశ రాజధానిలో అత్యల్పంగా కరోనా కేసులు, పూర్తిగా తగ్గిన కరోనా ఉధృతి

Delhi Corona Status: దేశ రాజధానిని భయభ్రాంతులకు లోను చేసిన కరోనా మహమ్మారి ఇప్పుడు పూర్తిగా శాంతించింది. ఏడాది కనిష్టానికి కేసులు చేరుకోవడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంటోంది. అటు కోవిడ్ పాజిటివిటీ రేటు కూడా గణనీయంగా తగ్గింది.

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)ఉధృతి అత్యంత ఎక్కువగా కన్పించింది మహారాష్ట్ర తరువాత దేశ రాజధాని ఢిల్లీలో. కరోనా విపత్కర పరిస్థితులతో ఢిల్లీ తల్లడిల్లింది. ఆక్సిజన్, బెడ్స్, అత్యవసర మందుల కొరతతో జనం విలవిల్లాడారు. ఆక్సిజన్ అందక పెద్దఎత్తున మారణకాండ సంభవించింది. కట్టుదిట్టమైన లాక్‌డౌన్‌తో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా అదుపులో వచ్చింది. అందుకే ఢిల్లీలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.అన్‌లాక్ ప్రక్రియ(Unlock) కూడా ప్రారంభమైంది.

ఢిల్లీలో (Delhi) ఏడాది కనిష్టానికి కరోనా కేసులు చేరుకున్నాయి. 2021లో అత్యల్పంగా కేవలం 89 కేసులే నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఇదే అత్యల్పమని తెలుస్తోంది. అటు కోవిడ్ పాజిటివిటీ రేటు కూడా ఢిల్లీలో 0.16 శాతానికి పడిపోయింది. ఢిల్లీలో ప్రస్తుతంత 1996 మంది మాత్రమే కరోనా చికిత్స పొందుతున్నారు. 563 మంది హోమ్ ఐసోలేషన్‌లో(Home Isolation)ఉన్నారు. మార్చ్ 10న నమోదైన 19 వందల యాక్టివ్ కేసుల తరువాత మళ్లీ అంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే. ఇప్పటి వరకూ ఢిల్లీలో 14 లక్షల 32 వేల 381 కోవిడ్ కేసులు నమోదు కాగా..గత 24 గంటల్లో 24 మంది మృత్యువాత పడ్డారు. ఢిల్లీలో కరోనా కారణంగా 24 వేల 925 మంది మరణించారు. 

Also read: Amarnath Yatra: కరోనా మహమ్మారి ముప్పు..అమర్‌నాథ్ యాత్రపై ప్రభుత్వం కీలక నిర్ణయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More