Home> జాతీయం
Advertisement

అనూహ్యంగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు.. 2 లక్షల PPE కిట్లు కావాల్సిందే.. సీఎం కేజ్రీవాల్

దేశంలో రోజుకు రోజుకు కరోనా మహమ్మారి విలయతాండవం ప్రదర్శిస్తోంది. పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయని, గత 24 గంటల్లో దేశంలో దేశంలో కొత్తగా 896 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కరోనా 

అనూహ్యంగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు.. 2 లక్షల PPE కిట్లు కావాల్సిందే.. సీఎం కేజ్రీవాల్

న్యూఢిల్లీ: దేశంలో రోజుకు రోజుకు కరోనా మహమ్మారి విలయతాండవం ప్రదర్శిస్తోంది. పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయని, గత 24 గంటల్లో దేశంలో దేశంలో కొత్తగా 896 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కరోనా కేసుల సంఖ్య 6761కి చేరుకుంది. వీరిలో 516 మంది కోలుకోగా 206 మంది దీని బారిన పడి మరణించారు.

కేంద్ర ఆరోగ్య శాఖసంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్  విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ గడిచిన 24 గంటల్లో దేశంలో 37 మరణాలు సంభవించాయని, మరో రెండు రోజలు పాటు కేసుల సంఖ్య ఎక్కువగానే ఉండే అవాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నట్లు తెలిపారు. దేశంలో కరోనా కేసు మొదలైన నాటి నుండి ఒక్క రోజులో అత్యధిక కొత్త కేసులుకానీ, మరణాలు కానీ నమోదు కావడం ఇదే తొలిసారని అన్నారు. అయితే అత్యధికంగా మహారాష్ట్రలో 1364 కరోనా పాజిటివ్ కేసులు కాగా, 125 మంది కోలుకోగా, 97 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లోనే రాష్ట్రంలో 25 మంది మృతి చెందారని, ముంబయి నగరంలోనే ఒక్క రోజులోనే 218 పాజిటివ్ కేసులు నమోదు కాగా 10 మరణించినట్లు బీఎంసీ ప్రకటించింది.

ఇప్పటివరకు నమోదైన కేసులతో ముంబయి నగరంలో కేసుల సంఖ్య 993కు చేరుకోగా మృతుల సంఖ్య 64కు చేరుకుంది. మరోవైపు తమిళనాడులో కొత్తగా 90కి పైగా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసులు సంఖ్య 900 చేరుకుంది. వీరిలో 21 మంది కోలుకోగా, ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ రాజధాని ఢిల్లీలో  కరోనా బాధితుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటివరకు 898 పాజిటివ్ కేసులు నమోదు కాగా 13 మంది మరణించారని వెల్లడించారు. కాగా ఢిల్లీ సీఎం అరవింద్ స్పందిస్తూ కనీసం రెండు లక్షల PPE కిట్ల అవసరముందని అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Read More