Home> జాతీయం
Advertisement

Delhi Liquor scam - Aravind Kejriwal Arrest : అసలు దిల్లీ లిక్కర్ స్కామ్ స్టోరీ ఏంటి.. ? కేజ్రీవాల్ అరెస్ట్‌తో బయటకు వస్తోన్న సంచలన నిజాలు..Part 1

Aravind Kejriwal Arrest: దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరెస్ట్ కావడంతో ఒక్కసారిగా దేశ రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణలో సీఎం కేసీఆర్ ముద్దుల తనయ కవిత అరెస్ట్ అయిన వారం వ్యవధిలోనే ఈ సంచలనం  చోటు చేసుకుంది. మొత్తంగా దిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో అసలు లిక్కర్ స్కామ్ వెనక ఏం జరిగిందనేది ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది.

Delhi Liquor scam - Aravind Kejriwal Arrest : అసలు దిల్లీ లిక్కర్ స్కామ్ స్టోరీ ఏంటి.. ? కేజ్రీవాల్ అరెస్ట్‌తో బయటకు వస్తోన్న సంచలన  నిజాలు..Part 1

Aravind Kejriwal Arrest: దిల్లీ లిక్కర్ స్కామ్ అనూహ్య మలుపు తిరిగింది. ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి అయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేయడంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ స్కామ్‌లో విచారణ కోసం తమ ముందు హాజరు కావాలని ఇప్పటికే తొమ్మిది సార్లు ఈడీ నోటీసులు జారీ చేసింది. వాటిని లెక్కచేయకుండా విచారణ విషయంలో ఎంతో జాప్యం చేసారు అరవింద్ కేజ్రీవాల్. ఈ కేసులో చివరగా ముందస్తు బెయిల్ కోసం కోర్టున ఆశ్రయించిన కేజ్రీవాల్‌కు అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోపే ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడం గమనార్హం. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. తెలంగాణ మాజీ సీఎం కూతురు కవిత అరెస్ట్‌కు దారి తీసిన దిల్లీ మద్యం కుంభకోణం గురించి తెలుసుకుందాం..

దిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం 2021లో కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చింది.  దీని ప్రకారం  మద్యం రిటైల్ అమ్మకాల నుంచి గవర్నమెంట్ పక్కకు తపుకుంది. లిక్కర్ షాపులు రన్ చేయడానికి ప్రైవేట్ లైసెన్స్ విధానాన్ని తీసుకొచ్చింది. దీని వల్ల లిక్కర్ బ్లాక్ మార్కెటింగ్ అరికట్టవచ్చు. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా సొమ్ములు చేరతాయనేది అప్పట్లో కేజ్రీవాల్ సర్కార్ ప్రకటించింది.

అయితే ఈ పాలసీ విషయంలో ప్రభుత్వం చెప్పింది ఒకటి.. అయింది మరొకటి కొత్త మద్యం పాలసీ వల్ల లిక్కర్ షాపులు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా.. తెల్లవారుఝామున 3 వరకు తెరిచి ఉందవచ్చు. మద్యంపై ప్రైవేట్ లైసెన్స్ దారులు అపరిమితమైన డిస్కౌంట్స్ అనౌన్స్ చేయవచ్చు. తాగుబోతు వినయోగదారులకు ఆకట్టుకునే ఆఫర్స్ ఇచ్చే అవకాశం దీంతో ఏర్పడింది. అంతేకాదు లిక్కర్ ఇంటికీ సరఫరా కూడా చెయ్యెచ్చు. ఇవన్నీ లిక్కర్ అమ్మకాలను ప్రోత్సహించడానికే అని చెప్పారు. కొత్త మద్యం పాలసీ వల్ల ప్రభుత్వ ఆదాయం దాదాపు 27 శాతానికీ పైగా పెరిగిందని చెప్పారు. అంతేకాదు రూ. 8,900 కోట్లు రాబడి వచ్చిందని దిల్లీ గవర్నమెంట్ ప్రకటించింది.

Also Read: Arvind Kejriwal: మద్యం కుంభకోణంలో అనూహ్య మలుపు.. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More