Home> జాతీయం
Advertisement

Sputnik v to Delhi: ఢిల్లీ ప్రజలకు త్వరలో ఉచితంగా స్పుత్నిక్ వి వ్యాక్సిన్

Sputnik v to Delhi: ఢిల్లీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కానుంది. దేశ రాజధానికి వ్యాక్సిన్ సరఫరా కోసం చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయి. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు కంపెనీ అంగీకరించింది

Sputnik v to Delhi: ఢిల్లీ ప్రజలకు త్వరలో ఉచితంగా స్పుత్నిక్ వి వ్యాక్సిన్

Sputnik v to Delhi: ఢిల్లీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కానుంది. దేశ రాజధానికి వ్యాక్సిన్ సరఫరా కోసం చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయి. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు కంపెనీ అంగీకరించింది.

దేశంలో వ్యాక్సినేషన్ కొరత(Vaccination Shortage) ఏర్పడిన నేపధ్యంలో ఢిల్లీ, తెలంగాణ, ఏపీ, పంజాబ్ వంటి కొన్ని ప్రభుత్వాలు గ్లోబల్ టెండర్లను ఆహ్వానించాయి. అయితే ఒక్క కంపెనీ కూడా ముందుకు రాలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని..ఒక్క రాష్ట్రానికి కూడా వ్యాక్సిన్ అందించలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) తెలిపారు. వ్యాక్సిన్ అవసరాన్ని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరముందని..వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచాలని కోరారు. మరోవైపు స్పుత్నిక్ వి (Sputnik V vaccine)తయారీదారులతో నేరుగా ఢిల్లీ ప్రభుత్వం చర్చలు జరిపినట్టు చెప్పారు. ఇందులో భాగంగా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఢిల్లీకు సరఫరా చేసేందుకు అంగీకారమైందని తెలిపారు. అయితే ఎంత మొత్తంలో సరఫరా చేస్తారనేది ఇంకా స్పష్టత కాలేదన్నారు.

ఇక లాక్‌డౌన్ విషయంలో కేజ్రీవాల్ స్పష్టత ఇచ్చారు. లాక్‌డౌన్‌ను(Lockdown) నిరవధికంగా కొనసాగించే ఆలోచన లేదని..అలాచేస్తే ఆర్ధిక, వ్యాపార కార్యకలాపాలు దెబ్బతింటాయన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో కేసులు తగ్గుముఖం పడుతున్నందున ఈ నెలాఖరులో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఢిల్లీలో వరుసగా నాలుగవ రోజు కూడా రెండు వేల కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1491 మంది ఢిల్లీలో కరోనా బారిన పడ్డారు.130 మంది మరణించారు. కరోనా పాజిటివిటీ రేటు ఢిల్లీలో ఇప్పుడు 1.93 శాతంగా ఉంది. మరోవైపు ఢిల్లీలో బ్లాక్ ఫంగస్ (Black Fungus)కేసులు ఆందోళన రేపుతున్నాయి. గత 24 గంటల్లో 6 వందల బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి.

Also read: Corona Homam: పొగ పీలిస్తే కరోనా పోతుందట..ఆ ఎమ్మెల్యే చేస్తున్న ప్రచారం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More