Home> జాతీయం
Advertisement

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కేసు నుంచి మనీశ్ సిసోడియాకు రిలీఫ్, ఛార్జిషీటులో లేని మనీశ్

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సీబీఐ ఛార్జిషీటుతో కీలక విషయాలు వెలుగుచూశాయి. సీబీఐ ఛార్జిషీటును ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ అస్త్రంగా మార్చుకుంది. ఆ వివరాలు మీ కోసం.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కేసు నుంచి మనీశ్ సిసోడియాకు రిలీఫ్, ఛార్జిషీటులో లేని మనీశ్

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. ఈ కేసులో సీబీఐ తొలి ఛార్జిషీటు దాఖలు చేయడంతో ఆప్ విమర్శలు ఒక్కసారిగా పెరిగాయి. 

ఢిల్లీ మద్యం కేసు ప్రారంభమైనప్పటి నుంచి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను టార్గెట్ చేసింది సీబీఐ. ఈ విషయమై మొదట్నించి కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేతికి ఇప్పుడు ఆయుధం లభించింది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన 10 వేల పేజీల చార్జిషీటులో ఇద్దరు వ్యాపారస్థులతో పాటు మరో ఐదుగురు ఉన్నారు. ఇందులో హైదరాబాద్, ఢిల్లీకి చెందినవారున్నారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్‌లో మనీశ్ సిసోడియా పేరున్నా..ఛార్జిషీటులో చేర్చలేదు సీబీఐ. 

సరిగ్గా ఇదే విషయాన్ని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అస్త్రంగా మార్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ముందు నుంచి చెబుతున్నట్టుగానే తమ పార్టీ నేత మనీష్ సిసోడియాపై పెట్టింది ఫేక్ కేసు అని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. 800 మంది 4 నెలలపాటు దర్యాప్తు చేసినా ఏం లభించలేదని చెప్పారు. ఈ కేసులో సీబీఐకు ఒక్క ఆధారం కూడా లభించలేదన్నారు కేజ్రీవాల్. ఇందులో కావాలనే మనీశ్ సిసోడియాను ఇరికించారన్నారు. 

ఢిల్లీ విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా పేద విద్యార్ధులకు మంచి భవిష్యత్తు అందించారని కేజ్రీవాల్ ప్రశంసించారు. అలాంటి మంచి వ్యక్తిపై తప్పుడు కేసుతో బురద చల్లే ప్రయత్నాం చేశారని మండిపడ్డారు.

Also read: Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తొలి ఛార్జిషీటు దాఖలు, ఏ1, ఏ2, ఏ3 ఎవరంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More