Home> జాతీయం
Advertisement

Delhi: జగన్ బాటలో కేజ్రీవాల్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాటలో డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పయనిస్తున్నారా అంటే అవుననే అన్పిస్తోంది. ప్రజా సంక్షేమ పధకాల అమలులో జగన్ ను అనుసరిస్తున్నారు కేజ్రీవాల్. 

Delhi: జగన్ బాటలో కేజ్రీవాల్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాటలో డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పయనిస్తున్నారా అంటే అవుననే అన్పిస్తోంది. ప్రజా సంక్షేమ పధకాల అమలులో జగన్ ను అనుసరిస్తున్నారు కేజ్రీవాల్. 

దేశ రాజధాని ఢిల్లీలో ఇక ఇంటింటికీ రేషన్ అందనుంది. ఘర్ ఘర్ రేషన్ యోజనకు ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపింది. కరోనా మహమ్మారి సంక్రమణ నేపధ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలకమైన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇంటింటికీ నేరుగా రేషన్ సరుకుల్ని అందించే క్రమంలో భాగంగా ఘర్ ఘర్ రేషన్ పధకాన్ని తీసుకొచ్చారు. ఈ పధకానికి ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలో అధికారికంగా ఈ పధకం ప్రారంభం కానుంది. కరోనా సంక్రమణ నేపధ్యంలో ఏపీలో ఇప్పటికే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా రేషన్ సరుకుల్ని నేరుగా ఇంటికే పంపిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇప్పుడు ఇదే బాటలో కేజ్రీవాల్ పయనిస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీలో అమలు చేస్తున్న మరి కొన్ని పధకాల గురించి ఇప్పటికే కేజ్రీవాల్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. Also read: AP: రేపు మధ్యాహ్నం కేబినెట్ విస్తరణ

Read More