Home> జాతీయం
Advertisement

Covishield: రాష్ట్రాలకు కరోనా వ్యాక్సిన్‌ రవాణా

దేశంలో జనవరి 16నుంచి కరోనావైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభంకానుంది. ముందుగా 3కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే.

Covishield: రాష్ట్రాలకు కరోనా వ్యాక్సిన్‌ రవాణా

Covishield vaccines consignment leaves Serum Institute Pune| ముంబై: దేశంలో జనవరి 16నుంచి కరోనావైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభంకానుంది. ముందుగా 3కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ మేరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు వ్యాక్సిన్ (Coronavirus Vaccine) తరలించే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. పూణెలోని సీరం ఇనిస్టిట్యూట్‌ (Pune) నుంచి కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ (Covishield vaccine) తరలింపు ప్రక్రియ మంగళవారం తెల్లవారుజామున ప్రారంభమైంది. పటిష్ట భద్రత మధ్య మొదటి డోసులతో కూడిన మూడు ట్రక్కులు పూణెలోని విమానాశ్రయం నుంచి ప్రత్యేక కార్గో విమానాల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు పయనమయ్యాయి.

పూణే నుంచి ఢిల్లీ, అహ్మదాబాద్‌, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కర్నాల్‌, హైదరాబాద్‌, విజయవాడ, గౌహతి, లక్నో, చండీగఢ్‌, భువనేశ్వర్‌కు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ట్రక్కుల్లో 478 బాక్సులను తీసుకెళ్లగా.. ప్రతి పెట్టె బరువు 32 కిలోలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఉదయం 10.30గంటల కల్లా వ్యాక్సిన్‌ ఆయా రాష్ట్రాలకు చేరనుంది. రాబోయే రోజుల్లో మరో ఐదు కంటైనర్లు గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, హర్యానాకు రవాణా చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ రవాణా కోసం ప్రత్యేకంగా ట్రక్కులు అందుబాటులో ఉంచారు. Also Read: Telangana: తొలి కరోనా వ్యాక్సిన్ నేనే తీసుకుంటా: మంత్రి ఈటల రాజేందర్

డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) ఆక్స్‌ఫర్డ్ - సీరం ఇనిస్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్‌, దేశీయంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవ్యాక్సిన్ (covaxin) వ్యాక్సిన్లను దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం సీరం, భారత్ బయోటెక్ కంపెనీలకు ఆర్డర్లను సైతం చేసింది. Also Read: Covishield: వ్యాక్సిన్ ధర 2 వందలే..సీరమ్ - కేంద్ర ప్రభుత్వం మధ్య డీల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More