Home> జాతీయం
Advertisement

వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఇకపై వాట్సప్ ద్వారా..ఎలా తీసుకోవాలంటే

Vaccine Certificate: కరోనా వ్యాక్సిన్ అనంతరం వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తీసుకోవడమనేది కొన్ని సందర్భాల్లో కష్టంగా మారుతోంది. కోవిన్ పోర్టల్‌లో తరచూ సమస్యలు తలెత్తడమే దీనికి కారణం. కానీ ఇప్పుడు వ్యాక్సిన్ సర్టిఫికేట్ తీసుకోవడం మరింత సులభతరంగా మారింది.

వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఇకపై వాట్సప్ ద్వారా..ఎలా తీసుకోవాలంటే

Vaccine Certificate: కరోనా వ్యాక్సిన్ అనంతరం వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తీసుకోవడమనేది కొన్ని సందర్భాల్లో కష్టంగా మారుతోంది. కోవిన్ పోర్టల్‌లో తరచూ సమస్యలు తలెత్తడమే దీనికి కారణం. కానీ ఇప్పుడు వ్యాక్సిన్ సర్టిఫికేట్ తీసుకోవడం మరింత సులభతరంగా మారింది.

కరోనా రెండు డోసుల వ్యాక్సినేషన్ అనంతరం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ(Union health ministry) ఓ సర్టిఫికేట్ జారీ చేస్తుంది.ఈ సర్ఠిఫికేట్ ఇప్పుడు చాలా అవసరం. ఓ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, ఓ దేశం నుంచి మరో దేశానికి వెళ్లేందుకు వ్యాక్సిన్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది. అయితే కోవిన్ పోర్టల్‌లో తరచూ సమస్యలు వస్తుండటంతో వ్యాక్సినేషన్ సర్ఠిఫికేట్(Vaccination Certificate) డౌన్‌లోడింగ్ ఒక్కోసారి కష్టంగా మారుతోంది. ఈ క్రమంలో సులభమైన ప్రత్యామ్నాయమైన వాట్సప్ ద్వారా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ పొందే విధానాన్ని అందుబాటులో తీసుకొచ్చింది కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ. వ్యాక్సిన్ ఒకడోసు తీసుకున్నా లేదా రెండు డోసులు తీసుకున్నా సరే వ్యాక్సినేషన్ సర్ఠిఫికేట్ పొందవచ్చు. వాట్సప్ ద్వారా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలంటే..

ముందుగా కరోనా హెల్ప్‌డెస్క్ వాట్సప్ నెంబర్ 9013151515 ను మొబైల్‌లో సేవ్ చేసుకోవాలి. అనంతరం కరోనా వ్యాక్సిన్ కోసం కోవిన్ పోర్టల్‌(Cowin portal)లో రిజిస్టర్ చేసుకున్న ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. వాట్సప్ కాంటాక్ట్ లిస్ట్‌లో సేవ్ చేసిన నెంబర్‌కు వ్యాక్సినేషన్ సర్ఠిఫికేట్ అని టైప్ చేయాలి. మీ రిజిస్టర్ నెంబర్‌కు ఆరు అంకెల ఓటీపీ వస్తుంది. చాట్‌బాక్స్‌లో ఓటీపీ ఎంటర్ చేయాలి. వ్యాక్సిన్ కోసం ఒక ఫోన్ నెంబర్‌తో ఒకరి కంటే ఎక్కువమంది రిజిస్టర్ చేసుకుంటే ఆ అందరి జాబితా మీ వాట్సప్‌కు వస్తుంది. అందులో ఎవరెవరి సర్ఠిఫికేట్లు కావాలో కోరుతుంది. ఆ వివరాలు సమర్పిస్తే చాలు..సెకన్ల వ్యవధిలోనే వ్యాక్సినేషన్ సర్ఠిఫికేట్ మీ వాట్సప్ చాట్‌బాక్స్‌లో ప్రత్యక్షమవుతుంది. డౌన్‌లోడ్(How to download vaccination certificate) చేసుకోవడమే తరువాయి.

Also read: దేశంలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా పాజిటివిటీ రేటు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More