Home> జాతీయం
Advertisement

Covid Cases Today India: ప్రపంచవ్యాప్తంగా పెరిగిన కొవిడ్​ కేసులు, మరణాలు.. ఇండియాలో 13 వేల దిగువకు కరోనా కేసులు

Covid Cases Today India: దేశంలో తాజాగా మరో 12,428 మందికి కొవిడ్ సోకింది. వైరస్​తో 356 మంది ప్రాణాలు కోల్పోగా.. 15,951 మంది కోలుకున్నారు.  

Covid Cases Today India: ప్రపంచవ్యాప్తంగా పెరిగిన కొవిడ్​ కేసులు, మరణాలు.. ఇండియాలో 13 వేల దిగువకు కరోనా కేసులు

Covid Cases Today India: దేశంలో కరోనా కేసులు మరింత దిగువకు వచ్చాయి. కొవిడ్​-19 కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. తాజాగా 13 వేలకు దిగువన కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్య కూడా తక్కువగానే నమోదైంది. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో 12,428 కేసులు (Covid Cases Today) వెలుగులోకి వచ్చాయి. ఇక పలు రాష్ట్రాలు మరణాల సంఖ్యను సవరిస్తుండటంతో ఈ సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. నిన్న 356 మంది కొవిడ్‌తో మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకూ ప్రాణాలు(Covid-19 Deaths) కోల్పోయిన వారి సంఖ్య 4,55,100కి చేరింది. 

గత కొన్ని రోజులుగా కొత్తగా నమోదవుతున్న కేసుల కంటే రికవరీలే (Recovery Cases) ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. నిన్న 15,951 మంది కోలుకున్నారు. అయితే సోమవారంతో పోలిస్తే రికవరీ తక్కువగా ఉంది. దీంతో ఇప్పటి వరకూ కొవిడ్‌ను జయించిన వారి సంఖ్య 33,575,623కు చేరి ఆ రేటు 98.19 శాతానికి (Covid-19 Recovery Rate in India) పెరిగింది. క్రియాశీల కేసుల కూడా క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల (Active Covid Cases In India) సంఖ్య 1,63,816 చేరి ఆ రేటు 0.49 శాతానికి దిగివచ్చింది. 

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌(Covid-19 vaccination) వేగంగా కొనసాగుతోంది. నిన్న వరకు 107.22 కోట్లకు పైగా వ్యాక్సిన్​ డోసులను అందించారు. దీంతో ఇప్పటి వరకూ అందించిన టీకా డోసుల సంఖ్య 1.02 కోట్లకు చేరింది.

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ కేసులు..

సోమవారంతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగానూ రోజువారి కరోనా కేసుల సంఖ్య (Corona Virus World Wide) స్వల్పంగా పెరిగింది. తాజాగా 3,35,244 మంది వైరస్ ​(Corona Update) బారిన పడ్డారు. కొవిడ్​​ ధాటికి మరో 5,292 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 24,48,15,858కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 49,69,991కు పెరిగింది.

Also Read: Covid alert: దేశంలో మరో కొత్త వేరియంట్ కలకలం..! మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో కేసులు నమోదు!  

Also Read: Zika Virus: ఉత్తరప్రదేశ్‌లో తొలి జికా వైరస్ కేసు.. ఐఏ‌ఎఫ్ ఆఫీసర్‌కు పాజిటివ్‌!   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More