Home> జాతీయం
Advertisement

Covid Cases In India: దేశంలో కొవిడ్ డేంజర్ బెల్స్.. ఢిల్లీలో భయపెడుతున్న పాజిటివిటీ రేటు..!!

Covid Cases In India: దేశంలో కోవిడ్ మహమ్మారి మళ్లీ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. గురువారం 2 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.

Covid Cases In India: దేశంలో కొవిడ్ డేంజర్ బెల్స్.. ఢిల్లీలో భయపెడుతున్న పాజిటివిటీ రేటు..!!

Covid Cases In India: దేశంలో కోవిడ్ మహమ్మారి మళ్లీ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. గురువారం 2 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం దేశ వ్యాప్తంగా 4 లక్షల 49 వేల మందికి కొవిడ్ నిర్దారణ పరీక్షలు చేయగా.. 2 వేల 380 మందికి వైరస్ నిర్దారణ అయింది. గత 24 గంటల్లో వైరస్ తో 56 మంది చనిపోయారు. కేరళలో 53 మంది ప్రాణాలు కోల్పోగా.. ఢిల్లీ, ఒడిశా, మిజోరం రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చనిపోయారు.  గత 24 గంటల్లో 12 వందల 31 మంది వైరస్ ను జయించారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 13 వేల 433కి పెరిగింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. 

న్యూఢిల్లీలో కొవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. బుధవారం ఢిల్లీలో వెయ్యి 9 కొత్త కేసులు వచ్చాయి. క్రితం రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య 60 శాతం పెరిగింది. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 5.7 శాతానికి పెరిగింది. ఢిల్లీలో కొవిడ్ తీవ్రతపై వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేరళ, మిజోరం, యూపీ, హర్యానా రాష్ట్రాల్లోనూ కొవిడ్ మహమ్మారి మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొన్ని రోజులుగా దేశంలో కొవిడ్ కొత్త కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉండటం ఆందోళన కల్గిస్తోంది. 

మరోవైపు ఢిల్లీలో జనవరి నుంచి మార్చి చివరి వరకు నమోదైన మరణాల్లో ఒమిక్రాన్ కేసులే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. 578 మంది  కొవిడ్ మృతుల నమూనాలను పరిశీలించగా.. 560 నమూనాల్లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వైరస్ నిర్దారణ అయింది. అంటే  97 శాతం ఒమిక్రాన్ వేరియంట్ కేసులే. మిగిలిన కేసుల్లోనూ డెల్టాతో సహా ఇతర వైరస్ వేరియంట్లు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.

 Also Read: Flipkart Summer Sale: ఫ్లిప్ కార్ట్ లో సమ్మర్ సేల్.. రూ.5,290లకే గోద్రేజ్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్!

 Also Read: Ram Gopal Varma: రాంగోపాల్ వర్మపై తీవ్ర విమర్శలు చేసిన నిర్మాత నట్టికుమార్..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More