Home> జాతీయం
Advertisement

Covid Infections india: కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి.. భారీగా పెరిగిన మరణాలు..

Covid-19 Update: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మళ్లీ కొవిడ్ కేసులు 12 వేలు దాటాయి. వైరస్ తో మరో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 98.66గా నమోదైంది. 
 

Covid Infections india: కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి.. భారీగా పెరిగిన మరణాలు..

Covid Infections india: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మరోసారి కేసులు 12వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 12,193 కొత్త కొవిడ్ కేసులు వెలుగు చూశాయి. మహమ్మారితో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 67,556కి చేరాయి. మెుత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.15శాతం అన్న మాట. 

మృతుల్లో 10 మంది కేరళ నుంచే ఉన్నారు.  దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య  5,31,300కి చేరాయి. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,48,81,877గా ఉంది. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,42,83,021కి చేరుకోగా, మరణాల రేటు 1.18 శాతంగా రికార్డుయింది. రికవరీ రేటు 98.66గా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 220.66 కోట్ల కొవిడ్ టీకాలు పంపిణీ చేశారు.

కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. ''కరోనా ఇంకా పోలేదు.. వైరస్‌ కట్టడి విషయంలో అలసత్వం వహించకుండా అప్రమత్తంగా ఉండాలంటూ'' కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు లేఖ రాశారు. వైరస్ వ్యాప్తి ఉద్ధృతి అవుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 

Also Read: COVID-19 daily update: దేశంలో 66 వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య.. కొత్త కేసులు ఎన్నంటే?

Also Read: Karnataka Assembly Elections: భారీగా పెరిగిన కర్ణాటక మంత్రుల ఆస్తులు.. ఎంతో తెలిస్తే దిమ్మతిరుగుద్ది..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.       

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More