Home> జాతీయం
Advertisement

India: 19లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనావైరస్‌ (Coronavirus) ఉధృతి నానాటికీ పెరుగుతూనే ఉంది. నిత్యం కరోనా కేసులు, మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే.. దేశంలో వరుసగా ఏడో రోజు కూడా 50 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

India: 19లక్షలు దాటిన కరోనా కేసులు

Covid-19 cases: న్యూఢిల్లీ : భారత్‌లో కరోనావైరస్‌ ( Coronavirus ) ఉధృతి నానాటికీ పెరుగుతూనే ఉంది. నిత్యం కరోనా కేసులు, మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే.. దేశంలో వరుసగా ఏడో రోజు కూడా 50 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 52,509 కరోనా కేసులు నమోదు కాగా.. నిన్న ఒక్కరోజే కరోనాతో 857 మంది మృతి చెందినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ( health ministry ) బుధవారం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 19,08,254కి పెరిగింది. ఇప్పటివరకు 39,795 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.  Also read: మహారాష్ట్ర మాజీ సీఎం కన్నుమూత

ప్రస్తుతం దేశంలో 5,86,244 యాక్టీవ్‌ కేసులు ఉండగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 12,82,216 మంది కోలుకున్నారు. ఇదిలాఉంటే.. దేశంలో కరోనా రికవరీ రేటు 66.30 శాతానికి పెరిగింది. బీరుట్‌లో భారీ పేలుళ్లు.. 78 మంది మృతి

Read More