Home> జాతీయం
Advertisement

Delhi: కోవిడ్ 19 థర్డ్ వేవ్ ప్రారంభం

ప్రపంచమంతా కోవిడ్ సెకండ్ వేవ్ గురించి భయపడుతుంటే...దేశ రాజధాని ఢిల్లీ మాత్రం థర్డ్ వేవ్ లో ప్రవేశించేసింది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.

Delhi: కోవిడ్ 19 థర్డ్ వేవ్ ప్రారంభం

ప్రపంచమంతా కోవిడ్ సెకండ్ వేవ్ ( Covid second wave ) గురించి భయపడుతుంటే...దేశ రాజధాని ఢిల్లీ ( Delhi ) మాత్రం థర్డ్ వేవ్ లో ప్రవేశించేసింది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.

కరోనా వైరస్ ( Corona virus ) మహమ్మారి నుంచి బయటపడకముందే రాజధాని నగరం ఢిల్లీలో మూడవదశ ప్రవేశించిందన్న వార్తలు భయం గొలుపుతున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Delhi cm Arvind kejriwal ) స్వయంగా ఈ ప్రకటన చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే వాయు కాలుష్యం, నీటి కాలుష్యంతో తల్లడిల్లుతున్న ఢిల్లీకు ఇది కచ్చితంగా ఊహించని పరిణామమే. 

దేశ రాజధాని ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేనివిధంగా కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. రోజురోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. అక్టోబర్ మొదటి వారం వరకూ తగ్గుతూ వచ్చిన కేసులు...ఆ తరువాత పెరగడం ప్రారంభమైంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయాన్ని అంగీకరించారు. ఓ వైపు పండుగల సీజన్  మరోవైపు వాయుకాలుష్యం కారణంగా కేసుల  సంఖ్య అకస్మాత్తుగా పెరిగినట్టు తెలుస్తోంది. 

ఢిల్లీలో కోవిడ్ 19 కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటాన్ని థర్డ్ వేవ్ ( Corona third wave ) గా పరిగణించవచ్చని కేజ్రీవాల్ తెలిపారు. అయితే ఢిల్లీ యంత్రాగం ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. ఇంతకుముందులా కొత్త కేసులు  మరింతగా విజృంభించ‌కుండా అవ‌స‌ర‌మైన‌ అన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు తొలిసారిగా 6 వేల మార్క్ దాటాయి. గత 24 గంటల్లో 6 వేల 7 వందల కేసులతో మొత్తం కేసుల సంఖ్య 4 లక్షలు దాటింది. 

శీతాకాలం కావడంతో శ్వాసకోశ సమస్యలతో ఇతర ప్రాంతాల్నించి పెద్ద సంఖ్యలో రోగులు రావడం, పండుగ సీజన్ వంటి అంశాల్ని పరిగణలో తీసుకుని..రోజుకు 15 వేల కరోనా కేసులొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ఘంగా ఉండానలని..నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఇప్పటికే హెచ్చరించింది. Also read: Arnab Goswami Arrest: ప్రతీకారం కాదు, చట్ట ప్రకారమే చేశామన్న సంజయ్‌ రౌత్‌

Read More