Home> జాతీయం
Advertisement

మార్చి 31 వరకు పాఠశాలలు, థియేటర్లు బంద్....

పెరుగుతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసుల దృష్ట్యా మార్చి 31 వరకు పాఠశాలలు, కళాశాలలతో పాటు సినిమా హాళ్ళను మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించిందని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇదే అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) మీడియా సమావేశంలో విలేకరులతో మాట్లాడుతూ.. 

మార్చి 31 వరకు పాఠశాలలు, థియేటర్లు బంద్....

న్యూఢిల్లీ: పెరుగుతున్న కరోనావైరస్​ పాజిటివ్ కేసుల దృష్ట్యా మార్చి 31 వరకు పాఠశాలలు, కళాశాలలతో పాటు సినిమా హాళ్ళను మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించిందని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇదే అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) మీడియా సమావేశంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఢిల్లీలోని అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డ్ యాజమాన్యం పరిధిలో గల ఖాళీగా ఉన్న ఫ్లాట్లను కరోనా పాజిటివ్ అని ద్రువీకరించినవారికి ఆసుపత్రిలోని ఇసోలేషన్ ను పోలి ఉండే విధంగా అన్నీ ఏర్పాట్లు చేస్తున్నామని అందుకు గాను ఉపయోగించుకోనున్నట్లు తెలిపారు.

Also Read: కరోనాకు భయపడొద్దు: ప్రధాని మోదీ

మరోవైపు జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలైన ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, షాపింగ్ మాల్స్ తో సహా అన్నీ బహిరంగ ప్రదేశాలను పూర్తిస్తాయిలో క్రిమిసంహారక మందులను పిచికారీ చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కాగా కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటివరకు మహారాష్ట్రలో తొమ్మిది, ఢిల్లీ, లడఖ్, ఉత్తర ప్రదేశ్, ఒక విదేశీ పౌరుడితో సహా 13 తాజా కేసులతో దేశంలో కరోనావైరస్ రోగుల సంఖ్య 73 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ(Ministry of Public Health and Family Welfare) గురువారం ఓ లేఖలో పేర్కొంది. 

 

Read Also: అది కేంద్ర అసమర్ధతకు నిదర్శనం: కేసీఆర్

దేశంలో అత్యధికంగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు ఉన్నకేరళ రాష్ట్రంలో ఇప్పటికే విద్యా సంస్థలను, థియేటర్లను మూసివేయాగా, రెండవ రాష్ట్రంగా ఢిల్లీ కూడా మార్చి 31, 2020 వరకు మూసివేయాలని నిర్ణయం తీసుకుందని సీఎం కేజ్రీవాల్ అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Read More