Home> జాతీయం
Advertisement

India: 46 వేలు దాటిన కరోనా మరణాలు

కరోనా తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్న దేశాలలో భారత్ ఒకటి. కరోనా కేసులు, మరణాలు రెండింటిలోనూ టాప్5లో భారత్ కొనసాగడం ఆందోళన రేకెత్తిస్తోంది. గడిచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 60,903 కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Cases in India) నమోదయ్యాయి.

India: 46 వేలు దాటిన కరోనా మరణాలు

ప్రపంచ దేశాలలో కరోనా వైరస్ (CoronaVirus) తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్న దేశాలలో భారత్ ఒకటి. కరోనా కేసులు, మరణాలు రెండింటిలోనూ టాప్5లో భారత్ కొనసాగడం ఆందోళన రేకెత్తిస్తోంది. గడిచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 60,903 కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Cases in India) నమోదయ్యాయి. అదే సమయంలో 834 మంది కరోనాతో పోరాడుతూ మరణించారు. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 46,091కి చేరింది. Sputnik V‌: రష్యా కరోనా వ్యాక్సిన్‌పై ఎన్నో అనుమానాలు.. అందుకు కారణాలు!

తాజా కేసులతో కలిపి భారత్‌లో నమోదైన మొత్తం కోవిడ్19 కేసుల సంఖ్య 23,29,639కు చేరింది. అందులో 16,39,600 మంది చికిత్స తర్వాత కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 6,43,948 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆగస్టు 12న ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తల్లి పాలతో కరోనా సోకుతుందా? ఏ జాగ్రత్తలు పాటించాలి 
COVID19 Symptoms: కరోనా పేషెంట్లలో ముఖ్యమైన లక్షణాలివే 

ఆగస్టు 11 వరకు 2,60,15,297 (2 కోట్ల 60లక్షలు) శాంపిల్స్‌కు కోవిడ్19 నిర్ధారణ చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది. నిన్న ఒక్కరోజే గరిష్టంగా 7,33,449 శాంపిల్స్‌ను పరీక్షించడం గమనార్హం. అందాల జాబిలి, నటి ఆషిమా సోగసు చూడతరమా..
పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే... 
RGV లెస్బియన్ నటి Naina Ganguly హాట్‌ ఫొటోలు

Read More