Home> జాతీయం
Advertisement

ప్రధాని మోదీకి సోనియా గాంధీ ఇచ్చిన సలహాలివే

క‌రోనా వైర‌స్ నివార‌ణ గురించి ప్ర‌ధాని నరేంద్ర మోదీకి పలు సలహాలు, సూచనలు అందిస్తూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం ఓ లేఖ రాశారు.అప్పుడే దేశం కరోనావైరస్‌పై సమర్థవంతంగా పోరాడగలదని ఆమె స్పష్టంచేశారు.

ప్రధాని మోదీకి సోనియా గాంధీ ఇచ్చిన సలహాలివే

న్యూ ఢిల్లీ : క‌రోనా వైర‌స్ నివార‌ణ గురించి ప్ర‌ధాని నరేంద్ర మోదీకి పలు సలహాలు, సూచనలు అందిస్తూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం ఓ లేఖ రాశారు. టీవీ, ప్రింట్‌, ఆన్‌లైన్‌ మీడియా మాధ్యమాల్లో ప్ర‌భుత్వం ఇస్తున్న వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌ను నిషేధించడం ద్వారా మిగిలే డబ్బును కోవిడ్-19 నివారణ చర్యల కోసం ఖర్చు చేయవచ్చన్నారు. అలాగే పీఎస్‌యూల‌పై కూడా రెండేళ్ల నిషేధం విధించాల‌న్నారు. తద్వారా ఆదా అయ్యే డబ్బులను కూడా కోవిడ్ నివారణకే వాడుకోవచ్చునని ప్రధాని మోదీకి సోనియా సూచించారు. 

Also read : Coronavirus updates ఏపీలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సమాచారం

20వేల కోట్ల ఖ‌రీదు అయిన సెంట్ర‌ల్ విస్టా బ్యూటిఫికేష‌న్‌, క‌న్‌స్ట్ర‌క్చ‌న్ ప్రాజెక్టును కేంద్రం వెంట‌నే ర‌ద్దు చేసుకోవాలని అన్నారు. అదే విధంగా ఉన్న‌త అధికారుల విదేశీ ప‌ర్య‌ట‌న‌లు అత్య‌వ‌స‌రంగా నిలిపేయడం ద్వారా కూడా ఎంతో ఖర్చును తగ్గించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. పీఎం కేర్స్‌కు వ‌చ్చిన నిధుల‌ను త‌క్ష‌ణ‌మే పీఎం నేష‌న‌ల్ రిలీఫ్ ఫండ్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయాల‌ని.. బ‌డ్జెట్‌లోనూ 30 Sonia Gandhi writes letter to PM Modiశాతం కోత విధించాల‌ని సోనియా గాంధీ. అప్పుడే దేశం కరోనావైరస్‌పై సమర్థవంతంగా పోరాడగలదని ఆమె స్పష్టచేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 

Read More