Home> జాతీయం
Advertisement

Corona Positive Cases: ఇండియాలో క్రమంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

India Corona Positive Cases: 3 కోట్ల 37 లక్షల 70 వేల 312 కరోనా కేసులతో అమెరికా అగ్రస్థానంలో ఉంది. అగ్రరాజ్యంలో 606,216 కరోనా మరణాలు సంభవించాయి. కరోనా కేసులలో రెండో స్థానంలో, మరణాలలో మూడో స్థానంలో భారత్ నిలిచింది.

Corona Positive Cases: ఇండియాలో క్రమంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

India Corona Positive Cases: ఇండియాలో వరుసగా రెండోరోజు కరోనా సెకండ్ వేవ్ కేసులు పెరిగాయి. మరోవైపు కరోనా రికవరీ రేటు 97.18 శాతానికి చేరింది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.37 శాతంగా ఉంది. రోజువారి పాజిటివిటీ రేటు 2.42 శాతానికి తగ్గింది. 33,770,312 (3 కోట్ల 37 లక్షల 70 వేల 312 కరోనా కేసులతో అమెరికా అగ్రస్థానంలో ఉంది. అగ్రరాజ్యంలో 606,216 కరోనా మరణాలు సంభవించాయి. కరోనా కేసులలో రెండో స్థానంలో, మరణాలలో మూడో స్థానంలో భారత్ నిలిచింది.

ఇండియాలో బుధవారం ఉదయం నుంచి గురువారం (జులై 8న) ఉదయం 8 గంటల వరకు కొత్తగా 45,892 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపితే దేశంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,09,557కు (3 కోట్ల 7 లక్షల 9 వేల 557)కు చేరుకుంది. నిన్నటితో పోల్చితే కరోనా కేసులు పెరగగా, కోవిడ్19 మరణాలు స్వల్పంగా తగ్గాయి. కరోనా వైరస్ (India Corona Positive Cases) మహమ్మారితో పోరాడుతూ మరో 817 మంది చనిపోయారు.  దేశంలో మొత్తం కోవిడ్19 మరణాలు 4,05,028 (4 లక్షల 5 వేల 028)కు చేరుకున్నాయి. గత ఏడాది నుంచి ఇప్పటివరకూ 36 కోట్ల 48 లక్షల 47 వేల 549 డోసుల కరోనా టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 

Also Read: COVID-19 Delta Variant: డెల్టా వేరియంట్ ప్రమాదకరమే, కరోనా టీకాల ప్రభావం అంతంతమాత్రమే

గడిచిన 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 33 లక్షల 81 వేల 671 డోసుల కరోనా టీకాలు వేశారు. దేశంలో మరో 44,291 మంది కరోనా మహమ్మారిని జయించగా, ఇప్పటివరకూ కరోనా బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,98,43,825 (2 కోట్ల 98 లక్షల 43 వేల 825)కు చేరింది. ఇండియాలో ఇప్పటివరకూ 42 కోట్ల 52 లక్షల శాంపిల్స్‌కు కోవిడ్19 (Delta Variant of Covid-19) నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో ప్రస్తుతం 4,60,704 (4 లక్షల 60 వేల 704) యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. 

Also Read: COVID-19 Vaccine: డెల్టా వేరియంట్‌పై Johnson and Johnson సింగిల్ డోసు టీకా ప్రభావం, 8 నెలలపాటు సేఫ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More