Home> జాతీయం
Advertisement

Delhi Fourth Wave Scare: ఢిల్లీలో కరోనా ఫోర్త్‌వేవ్ భయం, ఒక్కసారిగా 60 శాతం పెరిగిన కేసులు

Delhi Fourth Wave Scare: దేశంలో కరోనా ఫోర్త్‌వేవ్ సంకేతాలు ప్రారంభమైపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సంక్రమణ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒక్కసారిగా కేసుల సంఖ్య 60 శాతం పెరగడం ఆందోళన కల్గిస్తోంది. 

 Delhi Fourth Wave Scare: ఢిల్లీలో కరోనా ఫోర్త్‌వేవ్ భయం, ఒక్కసారిగా 60 శాతం పెరిగిన కేసులు

Delhi Fourth Wave Scare: దేశంలో కరోనా ఫోర్త్‌వేవ్ సంకేతాలు ప్రారంభమైపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సంక్రమణ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒక్కసారిగా కేసుల సంఖ్య 60 శాతం పెరగడం ఆందోళన కల్గిస్తోంది. 

కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసిరేందుకు సిద్ధమౌతోంది. జూన్ నాటికి కరోనా ఫోర్త్‌వేవ్ ప్రారంభం కానుందనే అంచనాలు నిజమయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. జూన్ నాటికి ప్రారంభమై అక్టోబర్ వరకూ ఉంటుందనే కాన్పూర్ ఐఐటీ నిపుణుల హెచ్చరికలు వాస్తవరూపం దాల్చనున్నాయా అన్పిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ, నోయిడాలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఇదే సంకేతమిస్తున్నాయి. 

ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా 60 శాతం పెరగడం ఆందోళన కల్గిస్తోంది. గత 24 గంటల్లో ఢిల్లీలో 1 వేయి 9 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది మంగళవారంతో పోలిస్తే 60 శాతం అత్యధికం. మంగళవారం నాడు ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 632గా ఉంది. ఫలితంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధారణను ఢిల్లీ ప్రభుత్వం మరోసారి తప్పనిసరి చేసింది. నిబంధనలు ఉల్లంఘించి మాస్క్ ధరించకపోతే 5 వందల రూపాయల జరిమానా విధిస్తారు. ఫిబ్రవరి 10వ తేదీ తరువాత ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే. గత 24 గంటల్లో ఢిల్లీలో 17 వేల 701 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా...5.7 శాతం మంది పాజిటివ్‌‌గా తేలారు. 

అదే మంగళవారం నాడు ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 4.42 శాతంతో 632 కేసులు వెలుగుచూశాయి అంతకుముందు అంటే సోమవారం నాడు 7.72 పాజిటివిటీ రేటుతో 501 కేసులు నమోదయ్యాయి. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 2 వేల 641కు చేరుకుంది. ప్రస్తుతం ఢిల్లీలో 54 మంది కోవిడ్ పాజిటివ్ వ్యక్తులు ఆసుపత్రుల్లో చేరగా..1578 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. డిల్లీలో  అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ఢిల్లీలో 9 వేల 737 బెడ్స్ కోవిడ్ రోగుల కోసం సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధారిటీ పలు కీలక నిర్ణయాలు తీసుంది. ఢిల్లీలో స్కూల్స్ మూసివేయకుండానే..నిపుణులతో చర్చించి..ప్రత్యేకమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్ తీసుకురానున్నామని డీడీఎంఏ తెలిపింది. ప్రస్తుతం ఢిల్లీలో సంక్రమిస్తున్నది కరోనా ఎక్స్‌ఈ వేరియంట్‌నా కాదా అనేది తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్స్ ప్రారంభించారు. 

Also read: Akshay Kumar Apology: పొగాకు కంపెనీతో కాంట్రాక్టు రద్దు చేసుకున్న అక్షయ్ కుమార్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More