Home> జాతీయం
Advertisement

UP Polls 2022: రాజకీయాలకు పాకిన 'పుష్ప' ఫీవర్... యూపీ ఎన్నికల కోసం 'శ్రీవల్లి' సాంగ్ ను వాడుకున్న కాంగ్రెస్..

 UP Election 2022: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' క్రేజ్ ను ఇప్పుడు రాజకీయాల్లో కూడా వాడేసుకుంటున్నారు. తాజాగా యూపీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల సాంగ్ ను రిలీజ్ చేసింది. 
 

UP Polls 2022: రాజకీయాలకు పాకిన 'పుష్ప' ఫీవర్... యూపీ ఎన్నికల కోసం 'శ్రీవల్లి' సాంగ్ ను వాడుకున్న కాంగ్రెస్..

UP Election 2022: 'పుష్ప' మేనియా ఇప్పట్లో తగ్గేలా లేదు. ఇప్పటివరకు ఈ సినిమాలోని సాంగ్స్, డైలాగ్స్ ను అనుకరిస్తూ.. మూవీలవర్స్ తో పాటు పలువురు స్టార్ క్రికెటర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పుష్ప ఫీవర్ రాజకీయాలకు తాకింది. త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల సాంగ్ ను శుక్రవారం రిలీజ్ చేసింది. 

 ‘పుష్ప’ సినిమాలోని '‘శ్రీవల్లి'’ పాటను ట్యూన్ గా తీసుకుని ఈ పాటను రూపొందించారు. ‘‘''తూ హై గజాబ్‌ యూ, యూపీ; తేరీ కసమ్‌, యూపీ(చాలా అందంగా ఉంటావు, యూపీ..)'' అంటూ సాగే వీడియో సాంగ్‌ను కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ‘ఉత్తరప్రదేశ్‌ వాసులం అయినందుకు గర్వంగా ఉంది..!’ అంటూ దీనికి క్యాప్షన్  ఇచ్చింది. 

ఓటర్లను ఆకర్షించేందుకు  రాజకీయపార్టీలు వినూత్నంగా ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల పంజాబ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తూ ఆమ్‌ ఆద్మీ పార్టీ ఓ ప్రత్యేక వీడియోను రూపొందించింది. 2007లో విడుదలైన హిందీ మల్టీస్టారర్‌ ‘'హే బేబీ'’ సినిమాలోని ‘'మస్త్‌ కలందర్‌'’ పాటను ఫొటో ఎడిట్‌ చేసి రూపొందించిన ఆ వీడియో సోషల్ మీడియా తెగ హల్ చల్ చేసింది. 

Also Read: Allu Arjun Zomato: మనసు కోరితే తగ్గేదే లే.. జొమోటో ఓపెన్ చేయడమే! అరె బన్నీ కూడా ఏసేశాడుగా!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More