Home> జాతీయం
Advertisement

Manish Tewari: కరెన్సీ నోట్లపై అంబేదర్క్ ఫొటో.. తెరపైకి కాంగ్రెస్ డిమాండ్.. సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలపై తీవ్ర చర్చ

Ambedkar Photo On Currency Notes: కరెన్సీ నోట్లపై ఢిల్లీ సీఎం చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. కరెన్సీ నోట్లపై గాంధీ చిత్రంతో పాటు డా బీఆర్ అంబేద్కర్ ఫొటోను ముంద్రించాలని డిమాండ్ చేసింది. 
 

Manish Tewari: కరెన్సీ నోట్లపై అంబేదర్క్ ఫొటో.. తెరపైకి కాంగ్రెస్ డిమాండ్.. సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలపై తీవ్ర చర్చ

Ambedkar Photo On Currency Notes: మన కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫొటోతో పాటు లక్ష్మీ, గణేష్ చిత్రాలను ముద్రించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దేశ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసేందుకు.. శ్రేయస్సు కోసం దేవుళ్ల ఆశీస్సులు కూడా అవసరమని ఆయన అన్నారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ కూడా రాస్తానని కేజ్రీవాల్ అన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే మరో డిమాండ్ తెరపైకి వచ్చింది. 

సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత మనీష్ తివారీ ట్వీట్ చేస్తూ.. కరెన్సీపై డా. బీఆర్ అంబేద్కర్ ఫొటో పెట్టాలని డిమాండ్ చేశారు. నోట్లకు ఒకవైపు మహాత్మాగాంధీ ఫొటో ఉండాలని.. మరోవైపు అంబేద్కర్ ఫొటో పెట్టాలని అన్నారు. 'కొత్త సిరీస్ నోట్లపై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రాన్ని ఎందుకు ఉంచకూడదు..? ఒకవైపు మహాత్మా గాంధీ, మరోవైపు డాక్టర్ అంబేద్కర్ చిత్రాలు ఉండాలి. అహింస, రాజ్యాంగవాదం, సమతావాదం ఒక అద్వితీయమైన యూనియన్‌గా కలిసిపోతాయి. ఇది ఆధునిక భారతీయ మేధావిని సంపూర్ణంగా ప్రతిబింబిస్తుంది.' అంటూ ఆయన ట్విటర్‌లో రాసుకొచ్చారు. 

 

అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. కేజ్రీవాల్ యూ టర్న్ ఎలా తీసుకుంటున్నారో అందరూ చూస్తున్నారని ఆ పార్టీ నేతలు అన్నారు. అంతకుముందు పొరపాటున దీపావళి జరుపుకుంటే జైలుకెళ్లడం ఖాయమని అన్నారని.. ఇప్పుడు నోట్లపై గణేష్, లక్ష్మీదేవి చిత్రాలను కూడా వేయాలని డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు.
 
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నోట్‌పై లక్ష్మీ-గణేష్ బొమ్మను పెట్టాలనే డిమాండ్ పెద్ద చర్చకు దారితీసేలా ఉంది. ఒకవైపు గాంధీజీ చిత్రం, మరోవైపు లక్ష్మీ-గణేష్‌ చిత్రం ఉంటే అది యావత్‌ దేశాన్ని ఆశీర్వదిస్తుందని ఆయన అన్నారు. లక్ష్మీదేవిని ఐశ్వర్యానికి దేవతగా భావిస్తారని.. గణేశుడు అన్ని కష్టాలను తొలగిస్తాడని ఆయన అన్నారు. అందుకే వీరిద్దరి చిత్రాలను కరెన్సీ నోట్లపై ప్రింట్ చేయాలని కోరారు.

Also Read: Allagadda Murder Case: 11 ఏళ్ల చిన్నవాడితో మహిళ వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య.. ఇలా దొరికిపోయారు

Also Read: India vs Netherlands: మరి కాసేపట్లో నెదర్లాండ్స్‌తో టీమిండియా పోరు.. వీళ్లపైనే అందరి కళ్లు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Read More