Home> జాతీయం
Advertisement

Punjab Congress Issue: పంజాబ్ పీసీసీ పగ్గాలు నవజ్యోత్ సింగ్ సిద్దూకేనా, త్వరలో అధికారిక ప్రకటన

Punjab Congress Issue: కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రాలపై దృష్టి సారించింది. అసంతృప్తులున్నా..ఫైర్‌బ్రాండ్ నేతలకే పట్టం కట్టే దిశగా యోచన చేస్తోంది. తెలంగాణలో రేవంత్ రెడ్డికి పగ్గాలు ఇచ్చినట్టే..పంజాబ్ పగ్గాలు నవజ్యోత్ సింగ్ సిద్దూకు అప్పగించినట్టు తెలుస్తోంది. అధికారికంగా ఇంకా ప్రకటన రావల్సి ఉంది.
 
కేంద్రంలో అధికారంలో రావాలంటే ముందు రాష్ట్రాల్లో బలపడాల్సిన అవసరాన్ని గుర్తించినట్టుంది కాంగ్రెస్ పార్టీ(Congress party). అందుకే రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితుల్ని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. తెలంగాణలో ఎంతమంది సీనియర్లు కాదన్నా..అసంతృప్తి వ్యక్తం చేసినా ఫైర్‌బ్రాండ్ లీడర్ రేవంత్ రెడ్డి(Revant reddy)కే పార్టీ పగ్గాలు అప్పగించింది. ఇప్పుడదే తరహాలో పంజాబ్‌లో కూడా పార్టీ పగ్గాల్ని క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూకు అప్పగించేందుకు దాదాపు నిర్ణయమైనట్టు సమాచారం. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ (Punjab cm Amarinder singh)ఇతర సీనియర్లు కాదన్నా సిద్దూకే పీసీసీ ఛీఫ్ పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. మరో ఇద్దరు సీనియర్ నేతల్ని వర్కింగ్ అధ్యక్షులుగా నియమించవచ్చు. పంజాబ్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో పార్టీ అంతర్గత కుమ్ములాటను నియంత్రించేందుకు ఈ నిర్ణయం తప్పనిసరిగా పార్టీ భావించింది. రెండేళ్ల నుంచి పంజాబ్‌(Punjab)లో కొనసాగుతున్న అంతర్గత విబేధాలకు సిద్దూ నియామకం ద్వారా ముగింపు పలకాలన్నది పార్టీ ఆలోచన. ముఖ్యమంత్రిగా అమరీందర్ సింగ్, పీసీసీ ఛీఫ్‌గా నవజ్యోత్ సింగ్ సిద్దూ(Navjot singh sidhu) కొనసాగనున్నారని..అధికారిక ప్రకటన ఒక్కటే ఆలస్యమని తెలుస్తోంది. 

Also read: Zika Virus: కేరళలో ఆందోళన రేపుతున్న జికా వైరస్, కొత్తగా మరో ఐదు కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More