Home> జాతీయం
Advertisement

Rajasthan: ఇద్దరు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ సస్పెన్షన్ వేటు

రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో వివాదం రోజురోజుకూ ముదురుతోంది. కీలకనేత సచిన్ పైలట్, మరో 18 సభ్యులను అనర్హులుగా పార్టీ అధిష్టానం ప్రకటించింది. దీంతో ఆ నేతలు హైకోర్టు మెట్లెక్కారు. ఈ నేపథ్యంలో మరో ఇద్దరు ఎమ్మెల్యేల పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది.

Rajasthan: ఇద్దరు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ సస్పెన్షన్ వేటు

జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ (Rajasthan Congress)లో వర్గపోరు తారాస్థాయికి చేరుతోంది. ఇదివరకే కీలక నేత సచిన్ పైలట్ (Sachin Pilot)‌ను డిప్యూటీ సీఎం, పార్టీ చీఫ్ పదవుల నుంచి అధిష్టానం తొలగించింది. సచిన్ పైలట్ సహా 19 మంది ఎమ్మెల్యేలకు నోటీసులకు జారీ చేసి వివరణ కోరింది. అయితే తమ నిర్ణయాలకు తలొగ్గడం లేదన్న కారణంగా  తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేలు భన్వర్‌లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్‌లపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. వీరి ప్రాథమిక సభ్యత్వాలను రద్దు చేసి షాకిచ్చింది. ప్రియుడితో లేడీ కానిస్టేబుల్ క్వారంటైన్.. ఊహించని ట్విస్ట్

మరోవైపు తమపై అనర్హత వేటు వేయగా.. సచిన్ పైలట్, 18 మంది ఆ నోటీసులను సవాల్ చేస్తూ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ నేడు విచారణకు రానున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ తమ పావులు చురుకుగా కదుపుతోంది. ఎలాగైనా సరే తమ ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది. అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్ సీపీ జోషి ఇచ్చిన నోటీసులకు వివరణ గడువు ముగియనుంది. Rajasthan: బీజేపీకు నో చెప్పిన సచిన్ పైలట్

కాగా, మనసు మార్చుకుంటే పార్టీలోకి ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని సచిన్ పైలట్‌కు కాంగ్రెస్ అధిష్టానం సూచిస్తోంది. మరోవైపు సచిన్ పైలట్‌పై తీవ్రస్థాయిలో విమర్శలదాడికి వెళ్లకూడదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు అధిష్టానం సూచించిందని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయానికి కట్టుబడితే పార్టీ వారికి అవకాశం ఇస్తుందని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధులు లీకులు ఇస్తున్నారు. మోడల్ Shweta Mehta Hot Photos వైరల్       
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

Read More