Home> జాతీయం
Advertisement

CM Kcr Tour: తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆలిండియా పర్యటన అందుకేనా..?

CM Kcr Tour: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా సుదీర్ఘ పర్యటనకు శ్రీకారం చుట్టారు. నేటి నుంచి పదిరోజులపాటు ఆయన జాతీయ నేతలతో మంతనాలు జరపనున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించనున్నారు. 

CM Kcr Tour: తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆలిండియా పర్యటన అందుకేనా..?

CM Kcr Tour: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా సుదీర్ఘ పర్యటనకు శ్రీకారం చుట్టారు. నేటి నుంచి పదిరోజులపాటు ఆయన జాతీయ నేతలతో మంతనాలు జరపనున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించనున్నారు. ఇప్పటికే బీజేపీపై సమర శంఖం పూరించిన సీఎం కేసీఆర్..మోదీ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. 

హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. దేశవ్యాప్తంగా పదిరోజులపాటు పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ముందుగా ఢిల్లీలో ఆయన టూర్‌ ఉంటుంది. హస్తినలో పలు రాజకీయ పార్టీ నేతలు, ప్రముఖ ఆర్థిక వేత్తలతో సమావేశం అవుతారు. మీడియా రంగానికి చెందిన ప్రముఖులతో భేటీ కానున్నారు. దేశ ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై పలువురితో చర్చించనున్నారు.

రాబోయే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు ఏకం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ యేతర శక్తిగా ఎదగాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పలువురు జాతీయ నేతలతో సమావేశమైయ్యారు. మలి దఫా టూర్‌కు తాజాగా శ్రీకారం చుట్టారు. ఢిల్లీ పర్యటన తర్వాత ఈనెల 22న చండీఘడ్‌, 26న బెంగళూరు, 27న రాలేగావ్ సిద్ధి, 29,30 తేదీల్లో బెంగాల్‌, బీహార్‌ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. 

టూర్‌లో ఆర్మీ అమరవీరుల కుటుంబాలను పరామర్శించనున్నారు. వ్యవసాయ చట్టాల రద్దు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలను ఓదార్చనున్నారు. 600 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది.  ఆయా రాష్ట్రాల్లో ముఖ్య నేతలతో మంతనాలు జరుపుతారని సీఎంవో అధికారిక ప్రకటన విడుదల చేసింది.

కర్నాటక పర్యటనలో మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమార స్వామితో సీఎం కేసీఆర్(CM KCR) భేటీకానున్నారు. 27న రాలేగావ్ సిద్ధికి వెళ్లనున్నారు. అక్కడ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శించుకుని హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. సీఎం వెంట ఎంపీలు సంతోష్‌కుమార్, రంజిత్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే ఆనంద్‌తోపాటు ఇతరులు ఉన్నారు. మొత్తంగా జాతీయ రాజకీయాలపై ఫోకస్‌ చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్..ఆ దిశగా పావులు కదుపుతున్నారు.  త్వరలో మరిన్ని పర్యటనలు ఉండనున్నట్లు తెలుస్తోంది.

Also read:Chalapathi Chowdary Death: టాలీవుడ్ లో విషాదం.. కెప్టెన్ చలపతి చౌదరి కన్నుమూత!

Also read:MLC Anantha Babu Car: సుబ్రహ్మణ్యం మృతి కేసులో ట్విస్ట్..ఆర్థిక లావాదేవీలున్నాయా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Read More