Home> జాతీయం
Advertisement

Prashanth Kishor: ప్రశాంత్ కిషోర్ పార్టీ వెనుక కేసీఆర్? ప్రత్యామ్నాయ శక్తి ఇదేనా?

Prashanth Kishor:ప్రస్తుతం రాజకీయాలు మనీతో కూడుకున్నాయి. చిన్న ప్రాంతీయ పార్టీ నడపాలంటేనే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎన్నికల ఖర్చు మరింత అదనం. అలాంటిది రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్.. జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెట్టడం అనేది సామాన్య విషయం కాదు

Prashanth Kishor: ప్రశాంత్ కిషోర్ పార్టీ వెనుక కేసీఆర్? ప్రత్యామ్నాయ శక్తి ఇదేనా?

Prashanth Kishor: దేశంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నారు ప్రశాంత్ కిషోర్. కొన్ని రోజులుగా దేశ రాజకీయాలన్ని ఆయన చుట్టే తిరుగుతున్నాయి. మమతా బెనర్జీతో చర్చలు జరపడంతో.. మమత ఆధ్వరంలో పీకే మూడో కూటమికి ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మంతనాలు సాగించడంతో .. కేసీఆర్ చెప్పిన ఫెడరల్ ఫ్రంట్ కు ఆయనే కీలకమనే వార్తలు వచ్చాయి. తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో చర్చలు జరపడంతో.. కాంగ్రెస్ లో చేరుతారనే టాక్ నడిచింది. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం ప్రణాళికలు కూడా పీకే రచించారని అనుకున్నారు. కాని తర్వాత సీన్ మారింది. కాంగ్రెస్ నేతలతో చర్చలు విఫలమయ్యాయో.. మరో కారణమో కాని.. తాను కాంగ్రెస్ లో చేరబోడం లేదంటూ తనపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు ప్రశాంత్ కిషోర్. తాజాగా తాను కొత్త పార్టీ పెడుతానని ట్వీట్ చేశారు. పీకే కొత్త పార్టీ నిర్ణయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

ఎన్నికల వ్యూహకర్తగా మొదట బీజేపీతో  కలిసి పని చేశారు ప్రశాంత్ కిషోర్. 2014 ఎన్నికల్లో మోడీకే ఆయనే కర్త, క్రమ, క్రియ. తర్వాత ప్రాంతీయ పార్టీలతో పయనించారు. బీహార్ లో నితీశ్ కుమార్, ఏపీలో జగన్, తమిళనాడులో స్టాలిన్, యూపీలో అఖిలేష్, పంజాబ్ లో కెప్టెన్ అమరీందర్ సింగ్ కోసం పని చేశారు.  జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో పని చేయాలని భావించినా కుదరలేదు. ఇప్పుడు కొత్త పార్టీతో జనంలోకి వస్తున్నారు . అయితే పీకే కొత్త పార్టీ వెనుక కొందరు నేతల హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాజకీయాలు మనీతో కూడుకున్నాయి. చిన్న ప్రాంతీయ పార్టీ నడపాలంటేనే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎన్నికల ఖర్చు మరింత అదనం. అలాంటిది రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్.. జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెట్టడం అనేది సామాన్య విషయం కాదు. అది కూడా మోడీ సారథ్యంలో రాజకీయంగా, ఆర్థికంగా అత్యంత బలంగా ఉన్న బీజేపీని ఎదుర్కొవడం అంత ఈజీ కాదు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ వెనుక కొందరు నేతలు ఉన్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ఇటీవల కాలంలో ప్రశాంత్ కిషోర్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఎక్కువ సన్నిహితంగా ఉంటున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలకు పీకేనే డైరెక్షన్ ఇచ్చారనే వార్తలు ఉన్నాయి. కేసీఆర్, పీకే కలిసి కొన్ని ప్రాంతీయ పార్టీల నేతలతో మాట్లాడారని అంటున్నారు. కొంత కాలం క్రితం వరకు బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక కూటమి గురించి మాట్లాడిన కేసీఆర్.. ఇటీవల మాత్రం మాట మార్చారు. కూటమి గురించి కాకుండా కొత్త ప్రత్యామ్నాయ శక్తి అవసరమని మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలోనూ జాతీయ రాజకీయాలపై చేసిన తీర్మానం సందర్భంగా కూటములు అవసరం లేదు.. ప్రత్యామ్నాయ పార్టీ అవసరం ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో జాతీయ స్థాయిలో కేసీఆర్ కొత్త పార్టీ పెడతారా అన్న చర్చ వచ్చింది. తాజాగా ప్రశాంత్ కిషోర్ పార్టీ తెరపైకి రావడంతో.. కేసీఆర్ చెప్పిన ప్రత్యామ్నాయ పార్టీ అదేననే అభిప్రాయం పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తోంది.  

ప్రశాంత్ కిషోర్ పార్టీకి ఆర్థికంగా సాయం చేసేందుకు కేసీఆర్ సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే ఇద్దరు నేతల మధ్య చర్చలు జరిగాయంటున్నారు. జాతీయ స్థాయిలో ఎలా ముందుకు వెళ్లాలి అన్న దానిపై కేసీఆర్ తో చర్చించాకే ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ ప్రకటన చేశారని అంటున్నారు. టీఆర్ఎస్ ప్రస్తుతం ఆర్థికంగా బలంగా ఉంది. తమకు వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని ప్లీనరీలో కేసీఆరే స్వయంగా ప్రకటించారు. విపక్షాలు మాత్రం కేసీఆర్ టీమ్ వేలకోట్ల రూపాయలు స్వాహా చేసిందని ఆరోపిస్తున్నాయి,. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారని సమాచారం. రెండు , మూడు రోజుల్లోనే ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ తో చర్చలు జరుపుతారని తెలుస్తోంది. 

READ ALSO: KTR VERSES KISHAN REDDY : కేటీఆర్ వర్సెస్ కిషన్‌ రెడ్డి.. బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య ట్వీట్ల యుద్ధం

Revanth Reddy: చంచల్ గూడ జైలుకు రేవంత్ రెడ్డి.. సీఎల్పీ అత్యవసర సమావేశం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Read More