Home> జాతీయం
Advertisement

CICSE 10th Class Results: ఐసీఎస్‌ఈ 'పది' ఫలితాలు విడుదల..రిజల్ట్ ఇలా చూసుకోండి..!

CICSE 10th Class Results: ఐసీఎస్‌ఈ(ICSE) ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యార్థులు కింది విధంగా చెక్‌ చేసుకోవచ్చు..

CICSE 10th Class Results: ఐసీఎస్‌ఈ 'పది' ఫలితాలు విడుదల..రిజల్ట్ ఇలా చూసుకోండి..!

CICSE 10th Class Results: ఎట్టకేలకు ఐసీఎస్‌ఈ(ICSE) పదో తరగతి ఫలితాలు వచ్చాయి. ఫలితాలను ద కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్సామినేషన్స్(CICSE) విడుదల చేసింది. ఫలితాల్లో 99.97 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.  నలుగురు విద్యార్థులు 99.8 శాతం స్కోర్ సాధించి టాపర్లుగా మిగిలారు. పుణెకు చెందిన హర్‌గుణ్ కౌర్ మథరు, కాన్పూర్‌కు చెందిన అనికా గుప్తా, బలరాంపూర్‌కు చెందిన పుష్కర్ త్రిపాఠి, లక్నోకు చెందిన కనిష్క మిత్తల్‌ టాప్‌లో నిలిచారు. 

మరో 34 మంది విద్యార్థులు 99.6 శాతం స్కోర్ సాధించి రెండో స్థానంలో నిలిచారు. మరో 72 మంది 99.4 శాతంతో మూడో ర్యాంక్‌ సాధించినట్లు ద కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్సామినేషన్స్(CICSE) తెలిపింది. ఐసీఎస్‌ఈ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికల ఉత్తీర్ణత 99.98 శాతం ఉండగా..బాలుర ఉత్తీర్ణత 99.97 శాతంగా ఉంది. ఫలితాలను cisce.org వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

cisce.org వెబ్‌సైట్‌లో యూనిక్ ఐడీ, ఇండెక్స్ నెంబర్‌తోపాటు అక్కడ వచ్చే కోడ్‌ ఎంటర్ చేయడం ద్వారా లాగిన్ అవొచ్చు. మొబైల్‌ నుంచి ICSE Unique ID ఎంటర్ చేసి 09248082883 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ చేయడం ద్వారా ఫలితాలను తెలుసుకునే అవకాశం ఉంది. మొదటి, రెండో సెమిస్టర్ల మార్కులకు ఫైనల్ స్కోర్‌లో సమాన వెయిటేజీ ఇచ్చినట్లు బోర్డు కార్యదర్శి గెర్రి ఆరథూన్‌ ఇటీవల వెల్లడించారు.

ఫైనల్‌ ఫలితాల్లో ప్రతి సబ్జెక్ట్‌కు ప్రాజెక్టు మార్కులు కలిపినట్లు తెలిపారు. సెమిస్టర్లకు హాజరుకాని విద్యార్థుల ఫలితాలను నిలుపుదల చేసినట్లు చెప్పారు. బోర్డు చరిత్రలో తొలిసారిగా ఒకే విద్యా సంవత్సరంలో రెండు పరీక్షలను నిర్వహించారు. గతేడాది చివరులో పది, 12 తరగతులకు తొలి సెమిస్టర్ పరీక్షలు చేపట్టారు. ఈఏడాది ఏప్రిల్, మేలో రెండో సెమిస్టర్‌కు పరీక్షలు నిర్వహించారు.

Also read:Corona Vaccination: దేశంలో కొనసాగుతున్న టీకా ఉద్యమం.. 200 కోట్ల మార్క్‌ దాటిన వ్యాక్సిన్..!

Also read:Margaret Alva: జగదీప్‌ ధన్‌ఖడ్‌ను ఢీకొట్టనున్న మార్గరెట్ అల్వా..ఇంతకు ఎవరీ మహిళ..?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More