Home> జాతీయం
Advertisement

Indian Students In China: దెబ్బకు దిగొచ్చిన చైనా, భారత విద్యార్థులకు అనుమతి..!!

Indian Students In China: భారత్ దెబ్బకు చైనా దిగొచ్చింది. చైనీయుల టూరిస్టు వీసాలను సస్పెండ్ చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంతో ఆ దేశం దారిలోకొచ్చింది. చాలా కాలం నుంచి తమదేశంలో చదువుతున్న భారత విద్యార్థులను అనుమతించకుండా సతాయిస్తున్న డ్రాగన్ దేశం ..ఇప్పుడు హడావుడిగా తమ నిర్ణయాన్ని కాస్త మార్చుకుంది.

Indian Students In China: దెబ్బకు దిగొచ్చిన చైనా, భారత విద్యార్థులకు అనుమతి..!!

Indian Students In China: భారత్ దెబ్బకు చైనా దిగొచ్చింది. చైనీయుల టూరిస్టు వీసాలను సస్పెండ్ చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంతో ఆ దేశం దారిలోకొచ్చింది. చాలా కాలం నుంచి తమదేశంలో చదువుతున్న భారత విద్యార్థులను అనుమతించకుండా సతాయిస్తున్న డ్రాగన్ దేశం ..ఇప్పుడు హడావుడిగా తమ నిర్ణయాన్ని కాస్త మార్చుకుంది. అవసరం ఉన్న విద్యార్థులను తమ దేశంలోకి అనుమతిస్తామని ప్రకటించింది. దీనిపై మార్గదర్శకాలు జారీచేసింది.

భారత విద్యార్థులను అనుమతించే విషయంపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ .. చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యూ తో మార్చి 22 న చర్చలు జరిపారు. చైనాలో చదువుతున్న భారత విద్యార్థులు రెండేళ్లుగా కోవిడ్ వల్ల చదువు నష్టపోయారని.. వారిని తిరిగి వెంటనే కాలేజీలకు అనుమతించాలని కోరారు. దీనిపై నెల రోజులైనా ఆదేశం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో విసిగిపోయిన భారత్... చైనీయుల టూరిస్టు వీసాలపై నిషేధం విధించింది. దెబ్బకు దిగొచ్చిన చైనా తమ విధానాన్ని కాస్త సడలించింది.

నూతన మార్గదర్శకాల ప్రకారం కాలేజీలతో అత్యవసరంగా పనున్న విద్యార్థులను చైనాలోకి అనుమతిస్తారు. భారత ఎంబస్సీ వారి వివరాలను చైనాకు అందిస్తుంది. ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుంది. విద్యార్థులు తమ వివరాలను గూగుల్ ఫామ్ లో మే 8 లోగా నింపాల్సి ఉంటుంది. వీరి వివరాలను పరిశీలించిన అనంతరం చైనా అధికారులు తుది లిస్టును ఖరారుచేస్తారు. అయితే అప్లై చేసుకున్న అందరినీ చైనా తిరిగి కాలేజీలకు పర్మిట్ చేసే అవకాశం లేదు. కేవలం కాలేజీలు అత్యవసరం అని చెప్పిన వారిని మాత్రమే తిరిగి తమదేశంలోకి అనుమతిస్తారు.

కొవిడ్ నేపథ్యంలో రెండేళ్ల కిందట చైనాలో చదువుతున్న భారతీయ విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు. అప్పటి నుంచి వారి చదువులు ఆగిపోయాయి. కొవిడ్ వరుస వేవ్‌లతో చైనా ఇతర దేశాల విద్యార్థులను తమ దేశంలోకి అనుమతించలేదు. అయితే ఐదారు నెలల నుంచి కొవిడ్ ఉధృతి తగ్గడంతో పలు దేశాల విద్యార్థులను మాత్రం తిరిగి కాలేజీలకు అనుమతించింది చైనా. భారత విద్యార్థులకు మాత్రం పర్మిట్ ఇవ్వకుండా సతాయిస్తోంది. దీనిపై భారత అధికారులు ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదు. చివరకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా ఈ అంశంపై చైనాతో మాట్లాడారు. అయినా నెల రోజుల నుంచి ఆ దేశం నాన్చుడు వైఖరి అవలంభిస్తోంది. చివరకు చైనా టూరిస్టు వీసాలను నిలిపేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంతో ఈ అంశంపై కదలిక వచ్చింది. అయితే ఎలాంటి నిబంధనలు లేకుండా చైనాలో చదువుతున్న భారత విద్యార్థులందర్నీ తిరిగి అనుమతించాలని మన దేశం డిమాండ్ చేస్తోంది. చైనాలో వేలాది మంది భారత విద్యార్థులు వైద్యవిద్య చదువుతున్నారు. రెండేళ్లుగా వారందరి చదువులూ ఆగిపోయాయి.

Also Read: Ramya Murder Case Verdict: బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు.. దోషికి ఉరి

Also Read: Acharya Movie : ఆచార్య కొరటాలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదా..?

రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More