Home> జాతీయం
Advertisement

Free Biryani For Tomatoes: బిర్యానీ లవర్స్ కు గుడ్ న్యూస్.. కేజీ టమాటాలకు బిర్యానీ ఉచితం

Free Biryani For Tomatoes: భోజన ప్రియులకు శుభవార్త. కిలో టమాటాలు తీసుకొస్తే.. అందుకు బదులుగా ఓ కిలో బిర్యానీ ఉచితంగా ఇస్తామని ఓ బిర్యానీ సెంటర్ ప్రకటించింది. ఇంతకీ ఆ టమాటాలకు బిర్యానీకి సంబంధం ఏంటీ అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి.

Free Biryani For Tomatoes: బిర్యానీ లవర్స్ కు గుడ్ న్యూస్.. కేజీ టమాటాలకు బిర్యానీ ఉచితం

Free Biryani For Tomatoes: బిర్యానీ లవర్స్ కు గుడ్ న్యూస్! రుచికరమైన బిర్యానీని ఉచితంగా ఇస్తామంటూ తమిళనాడులోని అంబూర్ బిర్యానీ సెంటర్ నిర్వాహకులు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే అందుకు ఓ కండిషన్ పెట్టింది. బిర్యానీ కోసం వచ్చే వారు కచ్చితంగా కిలో టమాటాలు వెంట తీసుకురావాలని బోర్డు పెట్టారు. దీంతో భోజన ప్రియులు ఎగబడి మరీ బిర్యానీని కొనడం వల్ల ఆ దుకాణానికి మంచి గిరాకీ వచ్చింది.

వివరాలకు వెళితే.. చెన్నై శివార్లలో ఉన్న అంబూర్ బిర్యానీ సెంటర్ నిర్వాహకులు భోజన ప్రియుల కోసం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. అయితే చెన్నైలో కేజీ రూ.150లకు పైగా పలుకుతుంది. ఈ నేపధ్యంలో చెంగల్పట్టు జిల్లాలోని మధురాంతకం ప్రాపర్టీలోని అంబూర్ బిర్యానీ షాప్ యజమాని తన సేల్స్ పెంచుకోవడం కోసం ఒక కొత్త ఆఫర్ కస్టమర్లకు ప్రకటిచారు. దీంతో బిర్యానీ కోసం భోజన ప్రియులు ఎగబడుతున్నారు. ఇంతకీ ఏం ఆఫర్ చేశాడంటే.. అంబూర్ బిర్యానీ షాప్‌లో ఒక కేజీ బిర్యానీ వంద రూపాయిలు.. ఎవరైనా రెండు కేజీల బిర్యానీ కొంటే వారికి అరకిలో టమాటాలు ఫ్రీగా ఇస్తామని ఆఫర్ చేశారు.

లేదంటే, ఒక కేజీ టమాటోలు తీసుకుని వచ్చి ఇస్తే.. ఒక కేజీ బిర్యానీ ఫ్రీగా ఇస్తామని ఆఫర్ ఇవ్వడం వల్ల జనం తండోపతండాలు వస్తున్నారు. దీంతో గిరాకీ పెరిగింది. తను అనుకున్నది సక్సెస్ అవ్వడంతో షాపు యాజమాని తెగ మురిసిపోతున్నాడు. అయితే, టమాటా ధర పతనంపై అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకే మంగళవారం ఫ్రీ సేల్‌ నిర్వహించినట్లు దుకాణం యజమాని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.  

Also Read: French bride, Bihari man: బిహార్ అబ్బాయి .. ఫ్రెంచ్ అమ్మాయి.. ఫ్రెంచ్ వధువును చూసేందుకు జనం క్యూ

ALso Read: Viral Videos: ట్రెయిన్‌లో సీటు దొరక్కపోతే మీరైతే ఏం చేస్తారు ? ఇదిగో ఈ వీడియో చూడండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More