Home> జాతీయం
Advertisement

Defence Jobs 2022: గుడ్ న్యూస్.. భారత త్రివిధ దళాల్లో 1.35 లక్షల పోస్టులు భర్తీ!

Defence Jobs 2022: నిరుద్యోగులకు శుభవార్త. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ కింద 1,35,850 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్ మెంట్ గురించి పూర్తి వివరాలు మీ కోసం.
 

Defence Jobs 2022: గుడ్ న్యూస్.. భారత త్రివిధ  దళాల్లో 1.35 లక్షల పోస్టులు భర్తీ!

Indian Army Recruitment 2022: భారత త్రివిధ దళాల్లో ఉన్న దాదాపు 1,35,850  పోస్టులను భర్తీ చేయనున్నట్లు మోదీ సర్కారు ఇటీవల రాజ్యసభకు (Indian Army Recruitment 2022) తెలియజేసింది. మెుత్తం ఖాళీల్లో ఇండియన్ ఆర్మీలో 1,16,464, ఇండియన్ నేవీలో 13,597, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)లో 5789 పోస్టులు ఉన్నట్లు రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ వెల్లడించారు. ఏ డిపార్ట్ మెంట్లో ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్నారో తెలుసుకుందాం. 

ఇండియన్ ఆర్మీ: 
ఆఫీసర్ పోస్టులు- 7,308
ఎంఎన్ఎస్ ఆఫీసర్లు - 471
జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్లు- 1,08,685 
ఇండియన్ నేవీ: 
ఆఫీసర్ పోస్టులు (మెడికల్, డెంటల్ మినహా)- 1446
సెయిలర్ల పోస్టులు- 12151
ఇండియన్ ఎయిర్ ఫోర్స్: 
ఆఫీసర్ల పోస్టులు- 572
ఎయిర్‌మెన్ పోస్టులు- 5217 

అగ్నిపథ్ స్కీమ్
ఇటీవల కేంద్రం 'అగ్నిపథ్' పేరిట కొత్త రిక్రూట్ మెంట్ స్కీమ్  ప్రకటించిన విషయం తెలిసిందే. త్రివిధ దళాలు కింద ఈ ఏడాది 46 వేల మంది అగ్నివీరులను నియమించుకోనున్నారు. ఇప్పటికే రిక్రూట్ మెంట్  ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఈ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న  సంగతి తెలిసిందే. 

Also Read:  Monkeypox: దేశంలో మంకీపాక్స్ టెర్రర్..తాజాగా వెలుగులోకి కొత్త కేసు..! 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More