Home> జాతీయం
Advertisement

DA hiked : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త వినిపించింది. డిఏ (dearness allowance) 4% పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.

DA hiked : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

న్యూ ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త వినిపించింది. డిఏ (dearness allowance) 4% పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో బేసిక్ పేలో ఇప్పటివరకు ఉన్న 17% డిఏ (DA) ఇకపై 21 శాతానికి చేరుకోనుంది. డిఏ పెంపు అనంతరం కేంద్రంపై రూ.14,500 కోట్ల అదనపు భారం పడనుంది. కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ.. '' జనవరి 1 నుంచి ఈ డిఎ పెంపు అమలులోకి వస్తుంది'' అని తెలిపారు.

యధావిధిగానే పెన్షనర్లకు సైతం ఈ పెంపు వర్తించనుంది. 50 లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు, 65 లక్షల మంది ఫించనుదారులు డీఏ పెంపు లబ్ధి పొందనున్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here

Read More