Home> జాతీయం
Advertisement

Oxygen plants: దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

Oxygen plants: కరోనా వైరస్ అత్యంత వేగంగా విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి బారిన పడ్డ రోగులు ఆక్సిజన్ అందక ప్రాణాలు విడుస్తున్నారు. దేశంలో ఏ మూల చూసినా ఆక్సిజన్ కొరతే. అందుకే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Oxygen plants: దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

Oxygen plants: కరోనా వైరస్ అత్యంత వేగంగా విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి బారిన పడ్డ రోగులు ఆక్సిజన్ అందక ప్రాణాలు విడుస్తున్నారు. దేశంలో ఏ మూల చూసినా ఆక్సిజన్ కొరతే. అందుకే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ప్రకంపనలు దేశాన్ని వణికించేస్తున్నాయి. రోజుకు 3.5 లక్షల కేసులు నమోదవుతున్న దారుణమైన పరిస్థితి. కరోనా రోగుల సంఖ్య పెరుగుతుండటంతో దేశంలో ఆక్సిజన్ కొరత (Oxygen Shortage) ఏర్పడింది. ఆక్సిజన్ అందక కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. దేశంలో ఉత్పత్తి అవుతున్న ఆక్సిజన్ తగినంతగా సరిపోవడం లేదు. అందుకే విదేశాల్నించి యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజన్ రప్పించుకోవల్సివస్తుంది. దేశమంతా ఆక్సిజన్ కొరత ఏర్పడిన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central government) కీలకమైన నిర్ణయం తీసుకుంది. పీఎం కేర్స్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 551 ఆక్సిజన్ ప్లాంట్లను ( 551 New Oxygen plants ) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఈ ఆక్సిజన్ ప్లాంట్లను సాంకేతికంగా పీఎస్ఏ (PSA) మెడికల్ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్‌గా పిలుస్తారు. ఈ ప్లాంట్లను వీలైనంత త్వరగా నిర్మించాలని ప్రధానమంత్రి ఆదేశించారు. వీటివల్ల జిల్లా స్థాయిలో పెద్ద మొత్తంలో ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని పీఎంవో కార్యాలయం ( PMO Office) తెలిపింది. ఈ ప్లాంట్లను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయనుంది. ప్రతి జిల్లాలో అధికారులు గుర్తించిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. కోవిడ్ రోగులకు, ఇతర రోగులకు అవసరమయ్యే ఆక్సిజన్ ఇక్కడే ఉత్పత్తి కానుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదనంగా 162 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు పీఎం కేర్స్ ఫండ్ నుంచి కేంద్ర ప్రభుత్వం 201 కోట్లు కేటాయించింది. ఈ ఆక్సిజన్ ప్లాంట్ల ( Oxygen Generation Plants) ను యుద్ధప్రాతిపదికన నిర్మించాల్సి ఉంది.

Also read: New Covid Vaccine: ఇండియాలో త్వరలో మరో కోవిడ్ వ్యాక్సిన్, మూడవ దశ పరీక్షలకు అనుమతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More