Home> జాతీయం
Advertisement

West Bengal Bypoll: భవానీపూర్ నుంచి దీదీ పోటీకు సిద్ధం, సెప్టెంబర్ 6న నోటిఫికేషన్

West Bengal Bypoll: పశ్చిమ బెంగాల్‌లో మరోసారి ఎన్నికల పోరు జరగనుంది. రాష్ట్రంలోని మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో మరోసారి బీజేపీ-టీఎంసీ మధ్య నువ్వా నేనా రీతిలో పోరు సాగనుంది. 

West Bengal Bypoll: భవానీపూర్ నుంచి దీదీ పోటీకు సిద్ధం, సెప్టెంబర్ 6న నోటిఫికేషన్

West Bengal Bypoll: పశ్చిమ బెంగాల్‌లో మరోసారి ఎన్నికల పోరు జరగనుంది. రాష్ట్రంలోని మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో మరోసారి బీజేపీ-టీఎంసీ మధ్య నువ్వా నేనా రీతిలో పోరు సాగనుంది. 

పశ్చిమ బెంగాల్(West Bengal)మరోసారి ఎన్నికల రణరంగానికి సిద్ధమౌతోంది. రాష్ట్రంలోని 3 అసెంబ్లీ స్థానాలకే ఎన్నికలు జరగాల్సి ఉన్నా..ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా బరిలో నిలవడంతో ఈ ఉపఎన్నికల ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలోని మూడు అసెంబ్లీ స్థానాలతో పాటు ఒడిశాలోని రెండు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమీషన్ (Central Election Commission)గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బెంగాల్ ఉపఎన్నికల నోటిఫికేషన్ సెప్టెంబర్ 6వ తేదీన విడుదల కానుంది. 

పశ్చిమ బెంగాల్‌లోని భవానిపూర్, షంషేర్ గంజ్, జంగీపూర్‌తో పాటు ఒడిశాలోని రెండు స్థానాలకు ఉప ఎన్నికల తేదీని ఎన్నికల సంఘం ప్రకటించింది. 2021 ఏప్రిల్ -మే నెలల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 స్థానాల్లో 213 స్థానాల్ని కైవసం చేసుకున్న మమతా బెనర్జీ(Mamata Banerjee)ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆమె స్వయంగా పోటీ చేసిన నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ..బీజేపీ అభ్యర్ధి సువేందు అధికారి చేతిలో 2 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ నేపధ్యంలో ఆరు నెలల్లోగా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నిక కావల్సి ఉంది. అందుకే బెంగాల్ రాష్ట్ర ప్రత్యేక అభ్యర్ధన, రాజ్యాంగపరంగా నెలకొన్న అత్యవసర పరిస్థితిని పరిగణలో తీసుకుని ఉప ఎన్నికలకు(West Bengal Bypoll) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. దేశంలోని మరో 31 అసెంబ్లీ, 3 పార్లమెంట్ నియోజకవర్గాల ఉపఎన్నికలు మాత్రం వాయిదా పడ్డాయి. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈసారి భవానీపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా మరోసారి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కడమే కాకుండా..బీజేపీ -టీఎంసీ పార్టీల మధ్య నువ్వా నేనా రీతిలో పోటీ ఉండనుంది. పశ్చిమ బెంగాల్‌లోని 3 అసెంబ్లీ స్థానాలకు సెప్టెంబర్ 30వ తేదీన పోలింగ్ జరగనుండగా..అక్టోబర్ 3వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. 

Also read: Covid19 Death Certificate: కోవిడ్ డెత్ సర్టిఫికేట్ మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More