Home> జాతీయం
Advertisement

CBSE Admit Card 2024: సీబీఎస్ఈ 10, 12 తరగతి అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ ఎలా

CBSE Admit Card 2024: సీబీఎస్ఈ బోర్డు 10, 12 తరగతుల పరీక్షలకు సంబంధించి కీలకమైన అప్‌డేట్ ఇది. మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానున్న పరీక్షల అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల కానున్నాయి. ఈ అడ్మిట్ కార్డుల్ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం..
 

CBSE Admit Card 2024: సీబీఎస్ఈ 10, 12 తరగతి అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ ఎలా

CBSE Admit Card 2024: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ త్వరలో 10, 12 తరగతి బోర్డు పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల చేయనుంది. సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in. నుంచి అడ్మిట్ కార్డుల్ని సులభంగా ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. 

సీబీఎస్ఈ 10, 12 తరగతుల బోర్డు పరీక్షలు వచ్చే వారం ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 15నుంచి మార్చ్ 13 వరకూ సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు జరగనుండగా, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకూ జరగనున్నాయి. 10, 12 తరగతుల పరీక్షలు ఉదయం 10.30 గంటల్నించి మద్యాహ్నం 1.30 గంటల వరకూ జరగనున్నాయి. అడ్మిట్ కార్డు లేకుండా పరీక్ష హాల్లోకి అనుమతి ఉండదు. అడ్మిట్ కార్డులో ఏమైనా తప్పులుంటే వెంటనే సంబంధిత ఇనిస్టిట్యూట్‌కు వెళ్లి సరి చేసుకోవాలి. 

సీబీఎస్ఈ 10,12 తరగతి అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ ఇలా

ముందుగా సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in.ఓపెన్ చేయాలి. కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో సీబీఎస్ఈ అడ్మిట్ కార్డు 2024 లింక్ క్లిక్ చేయాలి. లాగిన్ వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి. అంతే మీ అడ్మిట్ కార్డు స్క్రీన్‌పై ప్రత్యక్షమౌతుంది. ప్రింట్ తీసుకుని జాగ్రత్త చేసుకోవాలి.

Also read: Vande Bharat Sleeper Trains: దేశంలో మొదటి వందేభారత్ స్లీపర్ రైలు ఎప్పుడు, ఎక్కడి నుంచో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More