Home> జాతీయం
Advertisement

CBSE Board Exams 2024: సీబీఎస్ఈ 10, 12 వ తరగతి ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదల, జనవరి 1 నుంచి ప్రారంభం

CBSE Board Exams 2024: సీబీఎస్ఈ బోర్డు 2024 పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. ఫిబ్రవరి-మార్చ్ నెలల్లో పరీక్షలు జరగనున్నాయి. ఇప్పుడు ప్రాక్టికల్ పరీక్షలు షెడ్యూల్ కూడా విడుదలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
 

CBSE Board Exams 2024: సీబీఎస్ఈ 10, 12 వ తరగతి ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదల, జనవరి 1 నుంచి ప్రారంభం

CBSE Board Exams 2024: సీబీఎస్ఈ 10, 12వ తరగతి 2024 బోర్డు పరీక్షలు ఫిబ్రవరి-మార్చ్ నెలల్లో జరగనున్నాయనేది తెలిసిందే. ఇప్పుడు 10, 12 తరగతులకు ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జనవరి 1 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన మార్గదర్శకాల్ని సీబీఎస్ఈ బోర్డు విడుదల చేసింది. సీబీఎస్ఈ బోర్డు 10, 12 వ తరగతుల ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, మార్గదర్శకాల్ని జారీచేసింది. ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభానికి ముందు ఈ మార్గదర్శకాల్ని అన్ని సీబీఎస్ఈ స్కూల్స్ ఫాలో కావల్సి ఉంటుంది. 

సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in.లో ప్రాక్టికల్స్ పరీక్షల గైడ్‌లైన్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కావడానికి ముందే కావల్సినన్ని ప్రాక్టికల్ సమాధాన పత్రాలు అందాయో లేదో చెక్ చేసుకోవాలి. పరీక్షల షెడ్యూల్, ఫార్మట్ గురించి తల్లిదండ్రులు, విద్యార్ధులకు వివరించాల్సి ఉంటుంది. మౌళిక సదుపాయుల, ఎక్విప్‌మెంట్, మెటీరియల్స్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి. ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు ల్యాబ్ ఏర్పాట్లు పూర్తిగా ఉన్నాయో లేవో సరిచూసుకోవాలి. నిర్దేశిత తేదీ, సమయంలోగా ప్రాక్టికల్ పరీక్షలు సునాయసంగా జరిగేలా ఎగ్జామినర్లను సంప్రదించాలి. దివ్యాంగ విద్యార్ధులుంటే అవసరమైన ఏర్పాట్లు చేయాలి. 

సీబీఎస్ఈ 10, 12 వ తరగతి బోర్డ్ పరీక్షలు ఫిబ్రవరి - మార్చ్ నెలల్లో జరగనున్నాయి. దీనికి సంబంధించిన డేట్ షీట్ ఇటీవలే విడుదలైంది. సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 10 వరకు జరగనున్నాయి. ఇక 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 19 నుంచి మార్చ్ 13 వరకూ జరుగుతాయి. ఉదయం 10.30 గంటల్నించి మద్యాహ్నం 1.30 వరకూ పరీక్షలుంటాయి.

Also read: Aadhaar Card Update: మీ ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ ఇంట్లోంచే ఇలా మార్చుకోవచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More