Home> జాతీయం
Advertisement

CBSE Exams Schedule: సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల, ఎప్పట్నించంటే

CBSE Exams Schedule: సీబీఎస్ఈ విద్యార్ధులకు ముఖ్య గమనిక. పదవ తరగతి, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ విద్యా సంవత్సరం 10 లేదా 12వ తరగతి రాసే విద్యార్ధుల కోసం ఈ టైమ్ టేబుల్ ఇలా ఉంది. 

CBSE Exams Schedule: సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల, ఎప్పట్నించంటే

CBSE Exams Schedule: సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు 2024 కు సంబంధించన షెడ్యూల్ విడుదలైంది. పది, పన్నెండవ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న ప్రారంభమై 55 రోజులపాటు జరగనున్నాయి. ఏప్రిల్ 10న ముగియనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

2024 సీబీఎస్ఈ పరీక్షలకు సంబంధించి 10, 12 తరగతుల టైమ్ టేబుల్‌ను సీబీఎస్ఈ బోర్డు విడుదల చేసింది. సబ్జెక్ట్ వారీగా ఏ పరీక్ష ఎప్పడనే వివరాలు సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ cbse.nic.in మరియు cbse.gov.in.లో చూడవచ్చు. పదవ తరగతి, పన్నెండవ తరగతి రెండు పరీక్షలు ఫిబ్రవరి 15న ప్రారంభమై 55 రోజులపాటు జరగనున్నాయి. ఏప్రిల్ 10 వరకూ ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. రోజూ ఉదయం 10.30 గంటలకు పరీక్షలు ప్రారంభమౌతాయి. ప్రతిసారీ సీబీఎస్ఈ బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను నెల నుంచి నెలన్నర రోజుల ముందు విడుదల చేస్తుంటారు. ఈసారి రెండు నెలల ముందే విడుదలైంది. 

2022-23 విద్యా సంవత్సరం సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్షలు మార్చ్ 21న ముగిస్తే 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 5 వరకూ కొనసాగాయి. సింగిల్ షిఫ్ట్ లో ఉదయం 10.30 గంటల నుంచి మద్యాహ్నం 1.30 గంటల వరకూ పరీక్షలు జరగనున్నాయి. 2024-25 విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈలో పది, పన్నెండు తరగతుల పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఈ కొత్త విధానం వల్ల విద్యార్ధుల్లో ఒత్తిడి తగ్గుతుంది. అదే సమయంలో ఎక్కువ స్కోరు సాధించేందుకు అవకాశం, సౌలభ్యం లభిస్తుంది. అయితే రెండుసార్లు పరీక్షలకు హాజరవడం అనేది 10, 12 తరగతుల విద్యార్ధులకు తప్పనిసరి కాదని కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రదాన్ తెలిపారు. 

Also read: Chandrababu Case Updates: చంద్రబాబుని వెంటాడుతున్న కేసులు, ఏ కేసు పురోగతి ఎలా ఉందంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More