Home> జాతీయం
Advertisement

Union Budget 2024: పేదల సొంతింటి కల సాకారం కోసం.. కొత్త పథకం తీసుకొచ్చిన కేంద్రం..

Budget 2024: పేద, మధ్య తరగతి ప్రజలు సొంతింటి కల సాకరం చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభించబోతుంది. తాజాగా బడ్జెట్ లో దీనిపై ప్రకటన  చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 
 

Union Budget 2024: పేదల సొంతింటి కల సాకారం కోసం.. కొత్త పథకం తీసుకొచ్చిన కేంద్రం..

Budget 2024 Schemes: సొంతిల్లు కట్టుకోవాలంటే పేద, మధ్య తరగతి ప్రజలకు తలకు మించిన భారం. అలాంటి వారి కోసం కేంద్రం ఓ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. 2024-25 (Budget 2024) మధ్యంతర కేంద్ర బడ్జెట్‌లో భాగంగా.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ గృహనిర్మాణ పథకాన్ని ప్రకటించింది. అద్దె ఇళ్లతోపాటు మురికివాడల్లో నివసించే వారు సొంత ఇల్లు  కొనడానికి లేదా నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకువస్తుందని సీతారామన్ (finance minister Nirmala Sitharaman) తెలిపారు. అందరికీ ఇల్లు ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ మరియు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ పథకాలను కూడా ఇందులో చేర్చారు. 

పీఎంఏవై-రూరల్ పథకం కింద 3 కోట్ల ఇళ్లను నిర్మించామని సీతారామన్ చెప్పారు. కుటుంబాల సంఖ్య పెరగడం వల్ల తలెత్తే హౌసింగ్ డిమాండ్‌ను తీర్చడానికి వచ్చే ఐదేళ్లలో మరో 2 కోట్ల ఇళ్లను కట్టబోతున్నట్లు ఆమె తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద పట్టణాల్లో ఇల్లు నిర్మించుకోవాలనే వారి కోసం ఈసారి బడ్జెట్ లో భారీగా కేటాయింపులు చేశారు. గతేడాదితో పోలిస్తే కేటాయింపులు 66 శాతం పెరిగి రూ. 79,000 కోట్లకు చేరాయి. ఇందులో 'అందరికీ హౌసింగ్' మిషన్‌ను వేగవంతం చేయడానికి పీఎంవై-అర్బన్‌కు రూ. 25,103 కోట్లు, మిగిలిన మెుత్తాన్ని పీఎంవై-రూరల్ కు కేటాయించడం జరిగింది. 

Also Read: Budget 2024: మధ్యంతర బడ్జెట్ లో మరో గుడ్ న్యూస్.. 40 వేల బోగీలను వందే భారత్ రైళ్లలా అప్ గ్రేడ్..

Also Read: Budget 2024: నీలిరంగు చీరలో నిర్మలమ్మ.. ఇవి ఫైనాన్స్ మినిస్టర్ శారీ కలెక్షన్స్ ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More