Home> జాతీయం
Advertisement

క్రీడరంగంపై 'బడ్జెట్ 2018'లో వరాల జల్లులు

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'బడ్జెట్ 2018'లో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ క్రీడారంగంపై వరాల జల్లులు కురిపించారు.

క్రీడరంగంపై 'బడ్జెట్ 2018'లో వరాల జల్లులు

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'బడ్జెట్ 2018'లో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ క్రీడారంగంపై వరాల జల్లులు కురిపించారు. దాదాపు రూ.350 కోట్లను గత బడ్జెట్‌తో పోల్చుకుంటే ఎక్కువగా ఈ బడ్జెట్‌లో కేటాయించడం గమనార్హం. గత సంవత్సరం రూ.1592 కోట్లను క్రీడాశాఖకు కేటాయించగా.. ఈ సంవత్సరం రూ.1943 కోట్లను అదే శాఖకు కేటాయించారు. 2018లో కామన్వెల్త్ గేమ్స్‌తో పాటు ఆసియన్ గేమ్స్ ఉండడమే అందుకు కారణమని పలువురు అంటున్నారు. 

*ఈ బడ్జెట్ మొత్తంలో రూ.481 కోట్లను నేషనల్ క్యాంపులు నిర్వహించడానికి కేటాయిస్తారు.

*అలాగే వికలాంగుల్లో క్రీడలపై ఆసక్తిని పెంచేందుకు చేసే ప్రచారాల ఖర్చులకు గత సంవత్సరం రూ.4 కోట్లు కేటాయించగా.. ఈ సంవత్సరం కేవలం 1 లక్ష రూపాయలే కేటాయించడం గమనార్హం.

*"ఖేలో ఇండియా" పథకంలో భాగంగానే వికలాంగులకు కూడా చేయూతనిస్తామని.. అందుకే వారికి వేరేగా కేటాయింపులు చేయకుండా.. నామమాత్రంగా లక్ష రూపాయలు కేటాయించామని ఆర్థికమంత్రి చెప్పారు.

*అలాగే నేషనల్ స్పో్ర్ట్స్ ఫెడరేషన్‌‌ని ప్రోత్సహించేందుకు.. అలాగే సంస్థను అభివృద్ధి చేసేందుకు రూ.350 కోట్ల రూపాయలను కేటాయించారు. 

*నార్త్ ఈస్ట్ ప్రాంతంలో క్రీడల అభివృద్ధికి గాను రూ.148.4 కోట్లు కేటాయించారు. అలాగే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో క్రీడల అభివృద్ధికి గాను కేవలం రూ.75 కోట్లే కేటాయించారు. గత సంవత్సరం కూడా అంతే మొత్తం కేటాయించారు. 

*జాతీయ సేవా పథకం నిర్వహణకు రూ.144 కోట్లు కేటాయించారు. జాతీయ క్రీడా అభివృద్ధి నిధికి కేవలం రూ.2 కోట్లే కేటాయించారు. గత సంవత్సరం మాత్రం రూ.5 కోట్లు కేటాయించారు. 

*జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే క్రీడాభివృద్ధి పథకం "ఖేలో ఇండియా"కి ఈ సారి ప్రభుత్వం రూ.350 కోట్ల రూపాయలను కేటాయించింది. గత సంవత్సరం మాత్రం కేవలం 140 కోట్లే కేటాయించడం గమనార్హం. 

Read More