Home> జాతీయం
Advertisement

BOI Recruitment 2021: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్స్...పరీక్ష లేకుండానే 70 వేల వరకు జీతం..!

BOI Recruitment 2021: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దీనికి ఎటువంటి రాతపరీక్ష లేదు.
 

BOI Recruitment 2021: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్స్...పరీక్ష లేకుండానే 70 వేల వరకు జీతం..!

BOI Recruitment 2021: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (BOI Recruitment 2021) రిలీజ్ అయ్యింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల (Security Officer Posts)ను భర్తీ చేయనున్నారు. బ్యాంకు అధికారిక వెబ్ సైట్ bankofindia.co.in లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 07, 2022. 

నోటిఫికేషన్ వివరాలు..

పోస్ట్ పేరు- సెక్యూరిటీ ఆఫీసర్

పోస్టుల సంఖ్య - 25

జనరల్ కేటగిరీకి(General) - 11 పోస్టులు
ఓబీసీ(OBC) -09 పోస్టులు
ఎస్సీ(SC) - 02 పోస్టులు
ఎస్టీ(ST) - 02 పోస్టులు
ఈడబ్యూఎస్(EWS) - 01 పోస్ట్

Also Read: Bank Holidays January 2022: జనవరిలో మొత్తం 16 బ్యాంక్ హాలిడేస్​- పూర్తి వివరాలివే..

జీతం: నెలకు రూ. 48,170 నుండి నెలకు రూ. 69,810 వరకు  పే స్కేల్ ఉంటుంది. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

ఫీజు: జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఆర్థికంగా వెనుకబడిన  అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 850. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు రూ.175. ఈ రుసుమును నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చు.

ఎంపిక విధానం: ఈ జాబ్స్ కు ఎలాంటి రాత పరీక్ష లేదు. అయితే, అర్హత గల అభ్యర్థులను వ్యక్తిగత ఇంటర్వ్యూ లేదా గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

విద్యార్హతలు: భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఇది కాకుండా, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో కనీసం 5 సంవత్సరాలు అధికారిగా పని చేసిన వారు కూడా అర్హులే. వయస్సు 25-40 సంవత్సరాల మధ్య ఉండాలి. పూర్తి వివరాల కోసం బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook  

 

Read More